Share News

India vs England: నేడు ఇండియా vs ఇంగ్లండ్ ఫోర్త్ టెస్ట్ డే1.. కుర్రాళ్లు మళ్లీ రాణిస్తారా ?

ABN , Publish Date - Feb 23 , 2024 | 08:35 AM

భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాలుగో టెస్ట్ మ్యాచ్ రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో మరికాసేపట్లో జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకుంటుందా లేదా అనేది ఇప్పుడు చుద్దాం.

India vs England: నేడు ఇండియా vs ఇంగ్లండ్ ఫోర్త్ టెస్ట్ డే1.. కుర్రాళ్లు మళ్లీ రాణిస్తారా ?

భారత్, ఇంగ్లండ్(India vs England) మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాలుగో టెస్ట్ మ్యాచ్ రాంచీ(ranchi)లోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో కాసేపట్లో జరగనుంది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో భారత జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. హోమ్ గ్రౌండ్‌ అయిన నేపథ్యంలో వరుసగా 17వ సిరీస్ దక్కించుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు ఈ సిరీస్‌లో టీమిండియాను ఎలాగైనా కట్టడి చేయాలని ఇంగ్లండ్‌ జట్టు చూస్తోంది. ఇది వారికి చివరి అవకాశం కాగా ఈ మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగనుంది.

మహ్మద్ షమీ చీలమండ గాయంతో సిరీస్‌కు దూరమైనందున, ఇప్పుడు భారత పేస్ ఎటాక్‌ను నడిపించే బాధ్యత మహ్మద్ సిరాజ్‌(mohammed siraj)పై ఉంది. రెండో సీమర్‌గా ఆకాశ్‌దీప్‌ టెస్టుల్లో అరంగేట్రం చేయడం విశేషం. ఇప్పటివరకు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ లేకపోవడంతో రోహిత్ శర్మ సారథ్యంలోని జట్టుకు యువ బ్యాట్స్‌మెన్లు మంచి సపోర్ట్ ఇచ్చారు. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ ఇంగ్లండ్(England) వంటి జట్టుపై బాగా రాణిస్తున్నారు. ఈ క్రమంలో నేటి నుంచి మొదలు కానున్న ఈ మ్యాచులో ఎవరెవరో ఆకట్టుకుంటారో చూడాలి మరి.


నాలుగో టెస్టుకు భారత జట్టు(team india) అంచనా: రోహిత్ శర్మ (C), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (WC), కెఎస్ భరత్ (WC), దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్

నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు(England team) అంచనా : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (C), బెన్ ఫాక్స్ (WC), టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, ఆలీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: హైదరాబాద్‌, వైజాగ్‌లో రెండేసి మ్యాచ్‌లు

Updated Date - Feb 23 , 2024 | 08:35 AM