Google Maps: ఇకపై గూగుల్ మ్యాప్స్‌లో వాట్సాప్ లాంటి లైవ్ లొకేషన్ షేరింగ్ ఫీచర్
ABN , Publish Date - Jan 04 , 2024 | 12:54 PM
గూగుల్ మ్యాప్స్(Google Maps) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏదైనా ప్రాంతానికి వెళ్లాలంటే అనేక మంది దీనిని ఉపయోగిస్తారు. ప్రస్తుతం అనేక చోట్ల వాహనదారులు ఆయా ప్రాంతాల లైవ్ లొకేషన్ సెట్ చేసుకుని ప్రయాణాలు చేస్తుంటారు. ప్రస్తుతం దీనిని ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే టెక్ దిగ్గజం గూగుల్ దీనిలో వినియోగదారుల కోసం ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.
గూగుల్ మ్యాప్స్(Google Maps) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏదైనా ప్రాంతానికి వెళ్లాలంటే అనేక మంది దీనిని ఉపయోగిస్తారు. ప్రస్తుతం అనేక చోట్ల వాహనదారులు ఆయా ప్రాంతాల లైవ్ లొకేషన్ సెట్ చేసుకుని ప్రయాణాలు చేస్తుంటారు. ప్రస్తుతం దీనిని ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే టెక్ దిగ్గజం గూగుల్ దీనిలో వినియోగదారుల కోసం ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అది ఏంటంటే వాట్సాప్‌లో మాదిరిగా దీనిలో కూడా వినియోగదారులు తమ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు లైవ్ లొకేషన్(live location) షేర్(sharing) చేసుకోవచ్చని ప్రకటించారు. Google Maps లైవ్ లొకేషన్ షేరింగ్ ఫీచర్‌లో మీ ఫోన్ బ్యాటరీ స్థాయి వంటి కొన్ని అదనపు సమాచారాన్ని కూడా గుర్తు చేస్తుందని వెల్లడించారు.
గూగుల్ మ్యాప్స్ లైవ్ లొకేషన్ షేర్ చేయడం ఎలా
- లైవ్ లొకేషన్‌ను షేర్ చేయడానికి, ముందుగా మీ ఫోన్‌లో Google Maps యాప్‌ని తెరవండి
- ఆ తర్వాత స్క్రీన్ కుడి ఎగువ మూలలో కనిపించే ప్రొఫైల్ చిహ్నంపై క్లిక్ చేయండి
- ఇక మీదట ‘లొకేషన్ షేరింగ్’ ఆప్షన్‌పై క్లిక్ చేయగా వచ్చిన స్క్రీన్‌పై మీకు ‘షేర్ లొకేషన్’ బటన్ కనిపిస్తుంది
- అప్పుడు మీకు కొత్త విండోలో రెండు ఎంపికలు కనిపిస్తాయి. ఆ సమయంలో మీరు కావాలంటే లొకేషన్‌ను షేర్ చేసుకోవచ్చు లేదా మీరు దాన్ని ఆపివేసుకోవచ్చు
ఈ ఫీచర్ ఇప్పటికే Androidతోపాటు iOS ఫోన్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఫీచర్ భారతదేశంలో 13 ఏళ్లలోపు పిల్లలకు అందుబాటులో ఉండదని గూగుల్ తెలిపింది. ఇది కాకుండా ఇది Google WorkSpace డొమైన్ ఖాతాలో కూడా పని చేయదని వెల్లడించారు. ఈ ఫీచర్ Google Maps Goలో కూడా అందుబాటులో ఉండదని చెప్పారు.