AI Aadhaar card: బీ అలర్ట్.. AIతో నకిలీ ఆధార్ కార్డులు.. ఎలా గుర్తించాలంటే..
ABN , Publish Date - Apr 12 , 2025 | 05:12 PM
How To Identify AI Generated Aadhaar cards: దేశంలో ఆధార్ ఎంత కీలకమైన గుర్తింపు కార్డో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది ఆర్థిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ కొందరు నేరగాళ్లు ఎలాన్ మస్క్, ట్రంప్, ఆర్యభట్ట ఇలా ఎవరి పేరుతో కావలిస్తే వారి పేరుతో ఆధారు గుర్తింపు కార్డులు సృష్టిస్తూ జనాలను దోచుకునేందుకు కొత్త దోపిడీకి తెర తీశారు.

AI Generated Fake Aadhaar Cards: ఆధార్ అనేది 12 అంకెల ప్రత్యేక గుర్తింపు కార్డు. దీనిని భారత ప్రభుత్వం ప్రతి పౌరుడికి జారీ చేస్తుంది. పిల్లలు లేదా పెద్దలు ఎవరికైనా ఈ గుర్తింపు పత్రం తప్పనిసరిగా ఉండి తీరాలి. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థుల కోసం, బ్యాంకు అకౌంట్లు, ప్రభుత్వ పథకాలు, లావాదేవీలు, ధృవీకరణ పత్రాలు, టికెట్ బుకింగ్.. ఇలా అనేక అవసరాల కోసం ఐడెంటిటీ ప్రూఫ్‌గా ఆధార్ సమర్పించాల్సిందే. జీవితంలో విద్య, ఆర్థిక, వ్యాపారలావాదేవీలతో కచ్చితంగా లింక్ అయి ఉండే ఆధార్ కార్డును.. కృతిమ మేధ(AI)ను వాడుకుని నకిలీలను సృష్టిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. దీంతో ప్రజల్లో కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. అందుకే వెంటనే నకిలీలను ఎలా గుర్తించాలో తెలుసుకుని జాగ్రత్తపడండి.
ఇటీవలి కాలంలో కృత్రిమ మేధస్సు వేగంగా అభివృద్ధి చెందింది . ఈ మధ్యనే ChatGpt జిబ్లీ ఇమేజ్ ఫీచర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది. కానీ, అదే సమయంలోనే కృత్రిమ మేధస్సు (AI) ఫేక్ ఆధార్ కార్డులను కూడా సృష్టించింది. ఇటీవల, ఒక లింక్డ్ఇన్ వినియోగదారు ChatGPTని ఉపయోగించి ఆధార్ కార్డును ఎలా సృష్టించవచ్చో, దాన్నెలా తనిఖీ చేసుకోవాలతో ఆధారాలంతో సహా చూపించడం నెటిజన్లను షాక్‌కు గురిచేసింది. ఈ ఉదంతం సైబర్ భద్రత గురించి ప్రజల్లో కొత్త చర్చకు దారి తీసింది. బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ డేటా ఆధారంగా రూపొందించిన ఆధార్ అనేక ప్రభుత్వ పథకాలు, సేవలకు అనుసంధానించబడి ఉంటుంది.
నకిలీ, నిజమైన ఆధార్ కార్డు మధ్య తేడా ఎలా గుర్తించాలి?
AI ఉపయోగించి తయారు చేసిన నకిలీ ఆధార్ కార్డులు చూసేందుకు అసలు వాటిలాగే కనిపించవచ్చు, కానీ వాటిలో కొన్ని లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఉదాహరణకు ఏఐ ఉపయోగించి తయారు చేసిన ఆధార్ కార్డులో నిజమైన ఫోటోను అప్‌లోడ్ చేసినప్పటికీ.. ఫోటో క్రాస్ గానే కనిపిస్తుంది. అదే ఒరిజినల్ కార్డుపై ఉన్న పాస్‌పోర్ట్ సైజు ఫోటో స్పష్టంగా, ఖచ్చితంగా ఉంటుంది.
అక్షరాలలో తప్పులు
నిజమైన ఆధార్ కార్డులో పాస్‌పోర్ట్ సైజు ఫోటో స్పష్టంగా, మంచి నాణ్యతతో ఉంటుంది. అయితే నకిలీ దానిలో, ఫోటో కొద్దిగా అస్పష్టంగా లేదా మారిపోయి ఉంటుంది. నకిలీ కార్డులో ఉన్న అక్షరాల పరిమాణం, శైలి, అమరిక అసాధారణంగా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తాయి.
QR కోడ్‌ను స్కానింగ్
అసలు కార్డులో UIDAI, భారత ప్రభుత్వ లోగోల స్థానం స్పష్టంగా, ఖచ్చితంగా ఉంటుంది. అయితే నకిలీ దాంట్లో వంకరగా లేదా మసకబారి ఉండవచ్చు. QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ విషయం ఈజీగా బయటపడుతుంది. ఒరిజినల్ కార్డు QR కోడ్‌ను స్కాన్ చేయగానే UIDAI వెబ్‌సైట్ నుండి అసలు సమాచారం వస్తుంది. ఇది అత్యంత ఖచ్చితమైన మార్గం.
UIDAI వెబ్‌సైట్ ధృవీకరణ
మీరు UIDAI వెబ్‌సైట్ https://myaadhaar.uidai.gov.in/verifyAadhaar ని సందర్శించడం ద్వారా కూడా మీ ఆధార్ చెల్లుబాటును తనిఖీ చేయవచ్చు. ఇక్కడ 12 అంకెల ఆధార్ నంబర్, క్యాప్చాను నమోదు చేయండి. కార్డు నిజమైనదైతే "ఆధార్ ధృవీకరణ పూర్తయింది" అనే సందేశం కనిపిస్తుంది.
VID తో కూడా మిమ్మల్ని మీరు గుర్తించుకోండి.
VID అంటే వర్చువల్ ID. ఇది 16 అంకెల తాత్కాలిక ID. దీనిని ఆధార్ కార్డ్ హోల్డర్ మాత్రమే రూపొందించగలరు. ఇది మీ అసలు ఆధార్ నంబర్‌తో లింక్ చేయబడి ఉంటుంది. దీని ద్వారా మీ గుర్తింపును సురక్షితంగా ఉంచుకోవచ్చు.
Read Also: ఇది కదా టెక్నాలజీ అంటే.. 3Dతో 6 గంటల్లోనే రైల్వే స్టేషన్ కట్టేశారు..
AC Buying Tips: ఇన్వర్టర్ AC vs నాన్-ఇన్వర్టర్ AC.. రెండింటిలో ఏది బాగా కూల్ చేస్తుంది..
AI Image Generation: యువకుడి నుంచి ఫ్లాష్ ఫార్వర్డ్.. 2075లో మీరెలా కనిపిస్తారో తెలుసా..