Share News

ప్రశాంతంగా గ్రూప్‌-2 పరీక్షలు

ABN , Publish Date - Dec 15 , 2024 | 10:27 PM

జిల్లాలో ఆదివారం ప్రారంభమైన గ్రూప్‌-2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా 48 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఆదివారం నాటి పరీక్షలకు 14968 మంది అభ్యర్థులకుగాను ఉదయం 7446 మంది, మధ్యాహ్నం 7363 మంది అభ్యర్థులు మాత్రమే హాజరుకాగా, 83 మంది గైర్హాజరయ్యారు.

ప్రశాంతంగా గ్రూప్‌-2 పరీక్షలు

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబర్‌ 15(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఆదివారం ప్రారంభమైన గ్రూప్‌-2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా 48 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఆదివారం నాటి పరీక్షలకు 14968 మంది అభ్యర్థులకుగాను ఉదయం 7446 మంది, మధ్యాహ్నం 7363 మంది అభ్యర్థులు మాత్రమే హాజరుకాగా, 83 మంది గైర్హాజరయ్యారు.

సోమవారం జరిగే గ్రూపు-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. ఆదివారం ఆయన జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. నోడల్‌ అధికారులు, నిర్వాహకులకు సూచనలు అందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

నస్పూర్‌, (ఆంధ్రజ్యోతి) : నస్పూర్‌లో ఏర్పాటు చేసిన ఐదు కేంద్రాల్లో గ్రూప్‌-2 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో నిర్వహించిన రెండు పరీక్షలకు ఆయా ప్రాంతాల నుంచి అభ్యర్థులు హాజరయ్యారు. కాగా పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, డీసీపీ భాస్కర్‌, సీఐ ఆకుల అశోక్‌, ఎస్సై సుగుణాకర్‌లు పరిశీలించారు.

మందమర్రి టౌన్‌, (ఆంధ్రజ్యోతి): పట్టణంలో గ్రూపు 2 పరీక్షలు ప్రశాం తంగా జరిగాయి. ఉదయం పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. 144 సెక్షన్‌ విధించారు. సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్సై రాజశేఖర్‌లు బందోబస్తు చేపట్టారు.

Updated Date - Dec 15 , 2024 | 10:27 PM