తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
ABN , Publish Date - Dec 09 , 2024 | 11:04 PM
అకాల వర్షాలతో తడిసిన ధాన్యం, పత్తికి మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. నెన్నెల రైతులతో సోమవారం మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ మాట్లాడారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని, పత్తిని పరిశీలించారు.

నెన్నెల, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలతో తడిసిన ధాన్యం, పత్తికి మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. నెన్నెల రైతులతో సోమవారం మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ మాట్లాడారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని, పత్తిని పరిశీలించారు. ప్రభుత్వం సక్రమంగా ధాన్యం సేకరణ చేపట్టక పోవడం వల్లే రైతులు నష్టపోయారని అన్నారు. నామమాత్రంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని, సెంటర్లలో కనీస సౌకర్యాలు లేవన్నారు. టార్పాలిన్లు లేక ధాన్యం తడిసిందన్నారు. కొందరు రైతుల ధాన్యం నల్లబడి మొలకలు వచ్చిందన్నారు. రైతులు, ప్రజలు ఇక్కట్ల పాలవుతుంటే ఎమ్మెల్యే గడ్డం వినోద్, అధికారులు గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదని ఆరోపించారు. రైతాంగానికి న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా ఉండి పోరాడుతుందన్నారు. జిల్లా కార్యదర్శి గోవర్థన్, నాయకులు అజ్మిరా శ్రీనివాస్, కమల ఉన్నారు.
కన్నెపల్లి, (ఆంధ్రజ్యోతి): అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు కొయ్యల ఏమాజీ, మాజీ ఎమ్మెల్యే అమురాజలు శ్రీదేవిలు డిమాండ్ చేశారు. ముత్తాపూర్ కొనుగోలుకేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలిం చారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని లేకుంటే ఆందోళనలు చేస్తామన్నారు. బీజేపీ జిల్లా కార్యదర్శి గోవర్ధన్, మండల అధ్యక్షుడు బేరె రామయ్య యాదవ్, మాజీ సర్పంచు పుల్లూరి రాజయ్య, నాయకులు శ్రీనివాస్, కమల, రైతులు పాల్గొన్నారు.
జన్నారం, (ఆంధ్రజ్యోతి) : తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని బీఆర్‌ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జీ జాన్సన్ నాయక్ డిమాండ్ చేశారు. పొనకల్, రోటిగూడ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలిం చారు. రైతులతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని సూచించారు. మాజీ జెడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, నాయకులు జనార్ధన్, భరత్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్, రాజారాంరెడ్డి, నర్సగౌడ్ పాల్గొన్నారు.