ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు
ABN , Publish Date - Dec 16 , 2024 | 10:14 PM
జిల్లాలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. గ్రూప్-2 పరీక్షకు మొత్తం 14,951 మంది అభ్యర్థులకు గాను 48 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబర్ 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. గ్రూప్-2 పరీక్షకు మొత్తం 14,951 మంది అభ్యర్థులకు గాను 48 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి సెషన్‌ను ఉదయం 9 గంటల నుంచి రెండో సెషన్‌ను మధ్యాహ్నం 2 గంటల నుంచి నిర్వహించారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించలేదు. ఉదయం పరీక్షకు 7301 (48.84 శాతం) మంది అభ్యర్థులు, మధ్యాహ్నం పరీక్షకు 7293 (48.78 శాతం)మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించడంతో కలెక్టర్ కుమార్ అధికారులను అభినందించారు.
మందమర్రి టౌన్, (ఆంధ్రజ్యోతి) : గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు ఏసీపీ రవిందర్ తెలిపారు. సోమవారం పట్టణంలోని పరీక్ష కేంద్రాలను ఆయన సందర్శించారు. విద్యార్ధులను తనిఖీ చేశారు. సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్సై రాజశేఖర్‌లు పాల్గొన్నారు.