Money Saving Tips: జీవితంలో ఆర్థిక సమస్యలు రావొద్దంటే ఈ 3 తెలుసుకోవాల్సిందే..
ABN , Publish Date - Jan 12 , 2025 | 01:55 PM
Money Saving Plans: చాలా మంది కష్టపడి పని చేస్తుంటారు. ఆ పనికి తగ్గట్లుగా సంపాదిస్తుంటారు. కొందరు పని ఎక్కువ చేసినా.. సంపాదన మాత్రం తక్కువగా ఉంటుంది. ఫలితంగా చాలి చాలని జీతాలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ కాలం వెల్లదీస్తుంటారు.
Money Saving Plans: చాలా మంది కష్టపడి పని చేస్తుంటారు. ఆ పనికి తగ్గట్లుగా సంపాదిస్తుంటారు. కొందరు పని ఎక్కువ చేసినా.. సంపాదన మాత్రం తక్కువగా ఉంటుంది. ఫలితంగా చాలి చాలని జీతాలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ కాలం వెల్లదీస్తుంటారు. అన్నింటికంటే ముఖ్యంగా.. సంపాదించడం తెలిసిన కొందరికి.. వాటిని నిర్వహించడం తెలియదు. ఫలితంగా అనేక సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యలు ఎదురవ్వొద్దంటే డబ్బులను ఆదా చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకే.. జీవితంలో ఖచ్చితంగా ఆర్థిక ప్రణాళిక ఉండాలని పెద్దలు చెబుతుంటారు. చాలా మంది జీతం తక్కువని.. చాలి చాలని జీతంలో ఎలా సేవింగ్స్ చేసుకోవాలని చింతిస్తుంటారు. అందుకే.. తక్కువ జీతంలోనే డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం..
ఆర్థిక ప్రణాళిక..
డబ్బులు ఊరికే రావు. డబ్బు సంపాదించడం కూడా అంత తేలికైన పని కూడా కాదు. డబ్బు సంపాదించడంతో పాటు.. వాటిని నిర్వహించడం కూడా చాలా కష్టమైన పనే. జీతం రాగానే అడ్డగోలుగా ఖర్చు చేయడం.. ఆపై తదుపరి జీతం కోసం ఎదురు చూసే వారు చాలా మంది ఉంటారు. దీనికి కారణం ఆర్థిక నిర్వహణ లేకపోవడమే. జీతాన్ని ఎలా ఖర్చు చేయాలో తెలియక.. ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంటారు. జీతం ఎక్కువైనా.. తక్కువైనా.. మీ భవిష్యత్ సురక్షితంగా ఉండాలంటే.. ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బు ఆదా చేసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక సమస్యలు రాకుండా ఉండేందుకు.. జీవితంలో సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ 3 విషయాలు తెలుసుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు.
1. డబ్బును పెట్టుబడి పెట్టడం..
మనం సంపపాదించే డబ్బులో ప్రతి నెలా కనీసం 20 శాతం పెట్టుబడి పెట్టాలి. సరైన చోట పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్ సురక్షితంగా ఉంటుంది.
2. ఎమర్జెన్సీ ఫండ్..
ఉద్యోగం కోల్పోవడం, వ్యాపారంలో నష్టపోవడం వంటి చెడు సమయాలు ఎప్పుడైనా జరగవచ్చు. అటువంటి సమయంలో.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోనవసరం లేకుండా.. అత్యవసర నిధిని కలిగి ఉండాలి. కనీసం 6 నెలల పాటు సౌకర్యవంతంగా ఉండేందుకు తగిన అత్యవసర నిధిని సేవ్ చేసుకోవాలి. ఎమర్జెన్సీకి డబ్బులు కావాలని ఎవరినీ అడిగే పరిస్థితి లేకుండా చూసుకోవాలి. ఎల్లప్పుడూ ఒకరిని అడిగే బదులు.. మీ స్వంత డబ్బును దాచుకోవడం ఉత్తమం.
3. ఆరోగ్య బీమా..
కరోనా కాలం తర్వాత ప్రజలు ఆరోగ్య బీమా ప్రాముఖ్యతను బాగా అర్థం చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమాను కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ ఆరోగ్య బీమా భవిష్యత్తులో వైద్య ఖర్చుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రస్తుతం ఏ వ్యాధి వచ్చినా లక్షలు వెచ్చించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిలో ఆరోగ్య బీమాను తీసుకోవడం చాలా ముఖ్యం.
Also Read:
Travel Rush: పట్నం బైలెల్లినాదో!
నిర్మాణంలోని 11 విల్లాలు నేలమట్టం
For More Trending News and Telugu News..