Share News

కళ్లాల్లో తడిసిన ధాన్యం

ABN , Publish Date - Dec 07 , 2024 | 10:53 PM

ప్రకృతి వైపరీత్యానికి జిల్లాలోని రైతులకు తీరని నష్టం వాటి ల్లింది. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన వరి, పత్తి పం టలు చేతికి వచ్చే సమయంలో అకాల వర్షానికి తడిసి పోవడంతో నష్టం వాటిల్లింది. శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి జిల్లాలోని వేమనపల్లి, బెల్లంపల్లి, దండేపల్లి, జన్నారం మండలాల్లో అధిక నష్టం వాటిల్లి నట్లు తెలుస్తోంది. నాలుగైదు రోజులుగా వాతావరణం మబ్బులు పట్టి ఉండటంతో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పంట నీళ్ల పాలయిందని రైతులు వాపోతున్నారు.

కళ్లాల్లో తడిసిన ధాన్యం

మంచిర్యాల, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వైపరీత్యానికి జిల్లాలోని రైతులకు తీరని నష్టం వాటి ల్లింది. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన వరి, పత్తి పం టలు చేతికి వచ్చే సమయంలో అకాల వర్షానికి తడిసి పోవడంతో నష్టం వాటిల్లింది. శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి జిల్లాలోని వేమనపల్లి, బెల్లంపల్లి, దండేపల్లి, జన్నారం మండలాల్లో అధిక నష్టం వాటిల్లి నట్లు తెలుస్తోంది. నాలుగైదు రోజులుగా వాతావరణం మబ్బులు పట్టి ఉండటంతో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పంట నీళ్ల పాలయిందని రైతులు వాపోతున్నారు. రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రా లకు తరలించి, తేమ శాతం తగ్గించడానికి కళ్లాల్లో ఆరబెట్టారు. తేమ శాతం తగ్గనిదే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం సేకరించరనే ఉద్దేశ్యంతో వర్ష సూచన ఉన్నప్పటికీ ఆరబోయక తప్పని పరిస్థితి నెల కొంది. మరోవైపు వరి పంట కోతకు వచ్చిన చోట్ల కూడా వర్షం కారణంగా నష్టం వాటిల్లే పరిస్థితులు ఉన్నాయి. అలాగే పత్తి పంట సైతం పెద్ద ఎత్తున తడిసింది. పత్తి సేకరించే దశలో చెట్టుపైనే తడిసి ముద్దకావడంతో రైతులకు నష్టం వాటిల్లింది.

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో....

ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయడంతో జిల్లా వ్యాప్తంగా వరి పంటకు పెద్దగా నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. వానాకాలం సీజన్‌కు సంబం ధించి జిల్లాలో 1,60,605 ఎకరాల్లో వరి సాగు చేయగా 3,68,140 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అందులో ప్రైవేటులో అమ్మకాలు, పంట నష్టాలు పోను కనీసం 2 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించనున్నారు. మరోవైపు రైతులు కోసిన పంటను కోసినట్లుగా కళ్లాలకు తరలిస్తున్నారు. అక్కడ ఆరబెట్టి తేమ తగ్గగానే విక్రయిస్తున్నారు. జిల్లాలో మొత్తం 326 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యం కాగా 315 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా శనివారం నాటికి 14,191 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యానికి సంబంధించి రూ.13.67 కోట్లు 914 మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో కళ్లాల్లో పెద్దగా ధాన్యం లేకపోవడంతో నష్టం శాతం తగ్గింది. కొద్ది మొత్తం మాత్రమే కళ్లాల్లో ఆరబోసిన ఉండగా, రైతులు ముందు జాగ్రత్తగా టార్ఫాలిన్లు కప్పడంతో నష్టాన్ని నివారించగలిగారు. సన్నరకం సాగు చేసిన రైతులు పెద్ద మొత్తంలో ధాన్యాన్ని ప్రైవేటు మార్కెట్లో విక్రయిస్తున్నారు. సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రా లకు తరలించాల్సిన అవసరం లేకుండానే పొలాల వద్దనే కాంటా పెడుతున్నారు. జిల్లాలో వానాకాలం సాగు ఆలస్యం కావడంతో ఇంకా పూర్తిస్థాయిలో పంట చేతికి రాలేదు. రైతులకు నష్టం పెద్దగా వాటిల్లలేదని సమాచా రం. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం నిబంధనలు లేకుండా కొనుగోలు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

పత్తి పంటకు నష్టం...

అకాల వర్షానికి పత్తి రైతులకు అపార నష్టం వాటి ల్లింది. ఈ సీజన్‌లో జిల్లాలోని 1,57,645 ఎకరాల్లో రైతులు పత్తిసాగు చేయగా 16,10,495 క్వింటాళ్ల దిగుబడి వస్తుం దని అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా మొదటి దశను నవంబరు నుంచి డిసెంబరు మొదటి వారంలో చేరాల్సి ఉండగా, రెండో దశలో డిసెంబరు నుంచి జనవరి మొదటి వారంలోగా, మూడో దశలో డిసెంబరు చివరి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారంలోగా పూర్తవు తుందని అంచనా వేశారు. మొదటి దశ పత్తి ఏరుతుం డగానే అకాల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా కేవలం 40 శాతం మాత్రమే ఏరినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కేవలం 5 లక్షల పైచిలుకు క్వింటాళ్లు మాత్రమే పత్తి చేతికి వచ్చినట్లు సమాచారం. మిగతా 60 శాతం చేలలోనే ఉండిపోయింది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి చెట్లపై ఉన్న పత్తి పూర్తిగా తడిసిపోయింది. పత్తి తడిసిపోవడంతో రంగుమారి నల్లబడి పోతుందని రైతులు తెలిపారు. సీసీఐ కేంద్రాల్లో పత్తిలో నాణ్యత లేదని, ధరలో భారీగా కోతపెట్టే అవకాశాలు ఉన్నాయని వాపోతున్నారు.

Updated Date - Dec 07 , 2024 | 10:53 PM