Lok Sabha Election 2024: ఎన్నికల కోడ్‌తో మంత్రివర్గ సమావేశం వాయిదా
ABN, Publish Date - May 18 , 2024 | 08:39 PM
లోక్‌సభ ఎన్నికలతో (Lok Sabha Election 2024) ఎన్నికల సంఘం తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈరోజు(శనివారం) తెలంగాణ మంత్రి మండలి సమావేశం వాయిదా పడింది. అంతకుముందు కేబినేట్ సమావేశానికి ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది.
హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలతో (Lok Sabha Election 2024) ఎన్నికల సంఘం తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈరోజు(శనివారం) తెలంగాణ మంత్రి మండలి సమావేశం వాయిదా పడింది. అంతకుముందు కేబినేట్ సమావేశానికి ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది. కానీ ఈరోజు రాత్రి వరకు ఈసీ నుంచి అనుమతి రాలేదు. ఎన్నికల కమిషన్ అనుమతి రానందున రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు.
శనివారం మధ్యాహ్నం కేబినేట్ సమావేశం నిర్వహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈసీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో ఈరోజు జరగాల్సిన కేబినేట్ భేటీ నిలిచిపోయింది. ఈసీ నుంచి ఏ క్షణమైన అనుమతి వస్తుందని మంత్రులు అందరూ శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సచివాలయంలో వేచి ఉన్నారు.
Jeevan Reddy: కాంగ్రెస్ వస్తే రామాలయాన్ని బుల్డోజర్‌తో కూల్చేస్తారనడం దారుణం
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని విభాగాల అధికారులు కేబినేట్ భేటీకి హాజరయ్యేందుకు ఆఫీసులకు చేరుకున్నారు. కానీ రాత్రి 7 గంటల వరకు ఈసీ నుంచి స్పందన లేకపోవటంతో కేబినేట్ భేటీ జరుగలేదు. సీఎంతో పాటు మంత్రులు వెనుదిరిగి వెళ్లారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలపై ఈ భేటీలో చర్చించాలని అజెండా సిద్ధం చేసుకున్నారు. కానీ ఎన్నికల సంఘం నుంచి స్పందన లేకపోవటంతో రైతుల సంక్షేమం, అత్యవసరమైన అంశాలపై చర్చించలేకపోయామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.
Malla Reddy: మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా అందుకు సంబంధించిన వేడుకల నిర్వహణతో పాటు పునర్విభజనకు పదేళ్లు పూర్తి కావటంతో ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాలు, పునర్విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న కీలకమైన అంశాలను కేబినేట్ భేటీలో చర్చించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. కేబినేట్ భేటీ వాయిదా పడటంతో ఇవేమీ చర్చించలేదు.ఈసీ నుంచి అనుమతి ఎప్పుడు వస్తే.. అప్పుడే కేబినేట్ భేటీ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం లోపు ఈసీ నుంచి అనుమతి రాకపోతే, అవసరమైతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అనుమతి కోరుతామని చెప్పారు.
ఇవి కూడా చదవండి
Lok Sabha Election 2024: తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుస్తాం: కిషన్‌రెడ్డి
YS Jagan: వైఎస్ జగన్ లండన్ వెళ్తుండగా.. గన్నవరం ఎయిర్‌పోర్టులో అసలేం జరిగింది..?
AP News: కడప కోర్టు ఉత్తర్వులపై.. సుప్రీంకోర్టులో షర్మిల పిటీషన్
Read more Telagana News and Telugu News
Updated Date - May 18 , 2024 | 10:02 PM