Delhi: కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ..
ABN, Publish Date - Aug 05 , 2024 | 04:01 AM
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఆమెను మార్చి 15న తొలుత ఈడీ, అనంతరం ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
తిహాడ్‌లో ఆమెతో కేటీఆర్, హరీశ్‌రావు ములాఖత్ కూడా నేడే
న్యూఢిల్లీ, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఆమెను మార్చి 15న తొలుత ఈడీ, అనంతరం ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈడీ, సీబీఐ పెట్టిన రెండు కేసుల్లోనూ సాధారణ బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్‌ను గతంలోనే ట్రయల్ కోఉ్ట కొట్టివేసింది. ఈ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయగా అక్కడా నిరాశే ఎదురైంది.
ఈ నేపథ్యంలోనే ట్రయల్ కోర్టులోనే మళ్లీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని జూలై 22న విచారించిన ట్రయల్ కోర్టు జడ్జి కావేరి బవేజా కేసును సోమవారాని(ఆగస్టు 5)కి వాయిదా వేశారు. దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు తిహాడ్ జైలులో ఉన్న కవితను ఆమె సోదరుడు కేటీఆర్, హరీశ్‌రావు సోమవారం కలిసే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు బీఆర్‌ఎస్
తమ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. దీనిపై న్యాయ నిపుణులతో చర్చించేందుకు కేటీఆర్, హరీశ్‌రావులు శనివారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. ఆదివారం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులను కలిసి సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. హైకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలా? లేక సుప్రీంకోర్టును ఆశ్రయించాలా? అనే దానిపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.
Updated Date - Aug 05 , 2024 | 04:01 AM