TG Politics: రాష్ట్రంలో RUB ట్యాక్స్.. బీజేపీ నేత మహేశ్వరరెడ్డి సంచలన ఆరోపణలు
ABN , Publish Date - May 25 , 2024 | 03:27 PM
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు RUB ట్యాక్స్ వసూల్ చేస్తున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి (Maheswara Reddy) సంచలన ఆరోపణలు చేశారు. అవినీతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు.
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ నేతలు RUB ట్యాక్స్ వసూల్ చేస్తున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి (Maheswara Reddy) సంచలన ఆరోపణలు చేశారు. అవినీతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. ఉత్తమ్‌ను ప్రశ్నించాననే తనపై పోలీసు కేసు పెట్టారని.. తనకు సమాధానం చెప్పకుండా ఆయన మొహం ఎందుకు చాటేస్తున్నారని నిలదీశారు.
శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ...ఉత్తమ్ అవినీతిపై సీఎం రేవంత్‌రెడ్డికు బహిరంగ లేఖ రాస్తానని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రాన్ని బద్నాం చేసేందుకు కుట్ర చేశారని మండిపడ్డారు.
తక్కువ ధరకు ధాన్యం అమ్మి.. ఎక్కువ ధరకు బియ్యం ఎందుకు కొంటున్నారు? అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలులో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే సిట్టింగ్ జడ్జితో నిజనిర్ధారణ కమిటీ వేయాలని మహేశ్వరరెడ్డి కోరారు.
కాగా.. సీఎం రేవంత్‌రెడ్డికి బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి లేఖ రాశారు. పౌరసరఫరాల శాఖలో అవినీతిపై విచారించాలని వినతిపత్రంలో డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Balmoori Venkat:జీఓ 46 పైన పచ్చి అబద్ధాలు చెబుతున్న కేటీఆర్
AP Elections 2024: సీఎస్ జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్‌కి విరుద్ధం: దేవినేని ఉమ
Chandrababu: కాంబోడియాలో చిక్కుకున్న యువతను కాపాడాలి: చంద్రబాబు
AP Elections: బెయిల్ ఇచ్చినా పిన్నెల్లి బయటికి రాలేదేం..?
Vallabhaneni Vamsi: ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉరికించిన టీడీపీ యువత.. మామూలుగా లేదుగా!
AP Elections 2024: బూత్ ఏజెంట్‌కు వైసీపీ బెదిరింపులు.. రంగంలోకి దిగిన చంద్రబాబు
Read Latest Telangana News and Telugu News