Loksabha polls: బీఆర్ఎస్‌ను వీడటంపై కారణాలేంటో చెప్పిన రంజిత్ రెడ్డి
ABN, Publish Date - Apr 24 , 2024 | 01:35 PM
Telangana: ‘నేను పార్టీ మారడం కేటీఆర్‌కు ఇష్టం లేదు. కవిత అరెస్ట్ అయిన మూడు రోజులకు కేటీఆర్ కూడా స్టేడియం వెళ్లి మ్యాచ్ చూసాడు’’ అని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి చెప్పుకొచ్చారు. బుధవారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ...అపాయింట్మెంట్ అడిగే లీడర్‌కు రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 24: ‘‘నేను పార్టీ మారడం కేటీఆర్‌కు (BRS Working President KTR) ఇష్టం లేదు. కవిత (MLC Kavitha) అరెస్ట్ అయిన మూడు రోజులకు కేటీఆర్ కూడా స్టేడియం వెళ్లి మ్యాచ్ చూసాడు’’ అని చెప్పుకొచ్చారు చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి (Chevella Congress MP candidate Ranjith Reddy). బుధవారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో (ABN - Andhrajyothy) మాట్లాడుతూ... అప్పాయింట్మెంట్ అడిగే లీడర్‌కు రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. చేవెళ్ల ప్రజలే తనకు ముఖ్యమన్నారు. నలభై ఏండ్ల నుంచి చేవెళ్ళలోనే ఉన్నానని... తాను చేవెళ్ళకి లోకల్ అని తెలిపారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డితోనే (Konda Visveshwar Reddy) పోటీ అని... చేవెళ్ళలో పోటీ ఇద్దరి మధ్యే అని స్పష్టం చేశారు. కొండా తన ఓటమి ఒప్పుకున్నారని.. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే అని రంజిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ మారుతానని అనుకోలేదు...
కేటీఆర్ అంటే గౌరవం ఉందని... కానీ ఆయన అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ తనకు గౌరవం ఇచ్చిందని.. అయితే అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్లు వెల్లడించారు. ఐదేండ్లు ఎంపీగా సంతృప్తిగా ఉన్నానన్నారు. పార్టీలకు అతీతంగా తనకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. తాను పార్టీ మారుతా అని అనుకోలేదని.. బీఆర్ఎస్‌లో గెలిచే అవకాశం తక్కువ అనిపించి అలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులతో కొంత సమస్య ఉండేదని.. కానీ ఇప్పుడు అంతా నార్మల్ అయిందని రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.
ఎన్నికల అఫిడవిట్‌లో ఇలా...
కాగా.. ఎన్నికల అఫిడవిట్‌లో రంజిత్ రెడ్డి పేర్కొన్న వివరాలు మాత్రం చర్చనీయాంశంగా మారాయి. రంజిత్‌కు రూ.300 కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ సొంత కారు లేదంటూ అఫిడవిట్‌లో ఎంపీ అభ్యర్థి పేర్కొన్నారు. రంజిత్‌రెడ్డి పేరిట రూ.158.81కోట్లు, ఆయన భార్య సీతాదేవి పేరున రూ.135.52 కోట్లు, కుమారుడు రాజార్యన్‌రెడ్డి పేరున రూ.14.17లక్షల విలువ చేసే ఆస్తులున్నాయి. రంజిత్‌రెడ్డి పేరిట రూ.37.83లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, సతీమణి పేరున రూ.1.59కోట్ల విలువ చేసే బంగారు/వజ్రాభరణాలున్నాయి. ఇక ఆయన చేతిలో రూ.1.39లక్షలు, సతీమణి చేతిలో రూ.48,182 నగదు ఉంది. వివిధ బ్యాంకుల్లో రంజిత్‌రెడ్డి పేరిట రూ.20.39కోట్లు, ఆయన భార్య పేరున రూ.2.62కోట్లు అప్పులు ఉన్నాయి. తనపై ఓ క్రిమినల్ కేసు ఉన్నట్టు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
Loksabha polls: హాట్‌సీట్‌గా ఖమ్మం పార్లమెంట్ స్థానం.. పోటాపోటీగా ఆశావాహుల నామినేషన్లు
TS Elections: రూ.300 కోట్ల ఆస్తి ఉన్నా.. రంజిత్‌రెడ్డికి కారు లేదు!
Read Latest Telangana News And Telugu News
Updated Date - Apr 24 , 2024 | 01:46 PM