CM Revanth: రిజర్వేషన్లు కావాలా?.. వద్దా? అనేదానికి ఈ ఎన్నికలే రెఫరెండం
ABN , Publish Date - Apr 25 , 2024 | 01:32 PM
Telangana: ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం, బీజేపీ విధానం రిజర్వేషన్లు రద్దు చేయడమే అని.. ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనను దేశంపై రుద్దాలనే కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... రిజర్వేషన్లు రద్దు కోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వంద సంవత్సరాల్లో రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆర్‌ఎస్‌ఎస్ కంకణం కట్టుకుందన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 25: ఆర్‌ఎస్‌ఎస్ (RSS) భావజాలం, బీజేపీ (BJP) విధానం రిజర్వేషన్లు రద్దు చేయడమే అని.. ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనను దేశంపై రుద్దాలనే కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... రిజర్వేషన్లు రద్దు కోసం మోదీ (PM Modi) ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వంద సంవత్సరాల్లో రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆర్‌ఎస్‌ఎస్ కంకణం కట్టుకుందన్నారు. తమకి మెజారిటీ వస్తే రిజర్వేషన్లు తీసేయడం సులభమని మోదీ అనుకుంటున్నారని... ప్రధాని దేశాన్ని మోసం చేశారని దుయ్యబట్టారు. డబుల్ ఇంజిన్ అంటే అదానీ, ప్రధాని అంటూ వ్యాఖ్యలు చేశారు. పదేండ్లలో కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు.
Lok Sabha Polls 2024: తెలంగాణలో మళ్లీ మొదలైన ఫ్లెక్సీ వార్.. మోదీ హామీలను టార్గెట్ చేస్తూ..
ఆ 14 మంది కంటే మోదీ చేసిన అప్పులే ఎక్కువ...
పదేండ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని కేవలం 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్నారు. పదేండ్ల మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమన్నారు. నల్లధనం తెస్తానన్న మోదీ పది పైసలు కూడా తేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 55 రూపాయల పెట్రోల్.. మోదీ వచ్చాక రూ.110 చేశారన్నారు. జీఎస్టీ పేరుతో మోదీ దోపిడీ చేశారని మండపిడ్డారు. దేవుడి పేరు చెప్పే బీజేపీ అగరబత్తీలపై కూడా జీఎస్టీ వేశారన్నారు. చిన్న పిల్లల పెన్సిల్, రబ్బర్‌లపై కూడా జీఎస్టీ వేశారంటూ ఆగ్రహించారు. 14 మంది ప్రధాన మంత్రులు చేసిన అప్పుల కంటే.. మోదీ ఒక్కడే డబుల్ అప్పులు చేశారన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారులు అన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకు అమ్మేశారన్నారు. దేశాన్ని తప్పకుండా ఎక్స్ రే తీస్తామన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారు.
Jagan Vs CBN: ‘ఎంత నీచం’ అంటూ జగన్‌కు చంద్రబాబు దిమ్మదిరిగే కౌంటర్
ఓబీసీ రిజర్వేషన్లు 27 శాతాన్ని 50 శాతానికి పెంచుతారనేదే బీజేపీ భయమన్నారు. మండల్ ఉద్యమానికి వ్యతిరేకంగా బీజేపీ కమండల్ ఉద్యమాన్ని తెచ్చిందన్నారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లు తీసేయడానికి ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. కొందరు స్థానిక రాజకీయాల కోసం రిజర్వేషన్లు తీసేయడానికి సిద్ధమైన బీజేపీకి మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. రిజర్వేషన్లు కావాలా? వద్దా అనే దానికి ఈ ఎన్నికలు రెఫరెండమని తెలిపారు. రిజర్వేషన్లు ఉండాలి అనేవాళ్ళు కాంగ్రెస్‌కు ఓటేయాలని.. వద్దు అనేవాళ్ళు బీజేపీకి ఓటేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Watch Video: ఘనంగా పెళ్లి బరాత్.. అంతలోనే ఊహించని షాక్ ఇచ్చిన మహిళ..!
AP Elections: పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్ నామినేషన్
Read Latest Telangana News And Telugu News