Revanth Vs KCR: కేసీఆర్‌కు చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తా!
ABN, Publish Date - Apr 06 , 2024 | 09:13 PM
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శనివారం నాడు తుక్కుగూడ కాంగ్రెస్ ‘జనజాతర’ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌కు చర్లపల్లిలో జైలులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శనివారం నాడు తుక్కుగూడ కాంగ్రెస్ ‘జనజాతర’ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌కు చర్లపల్లిలో జైలులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని వార్నింగ్ ఇచ్చారు. చర్లపల్లి జైలులో కేసీఆర్‌కు చిప్పకూడు తినిపిస్తానని మందలించారు. ఆయన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టివ్వలేదని అన్నారు. తాను మాత్రం కేసీఆర్‌కు తప్పకుండా చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని హెచ్చరించారు.
బిడ్డ, కొడుకు, అల్లుడు, ఆయన అందరూ కలిసి ఉండేలా ఇల్లు కట్టిస్తానని అన్నారు. ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోనని కేసీఆర్‌కు రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. నిన్న(శుక్రవారం) కరీంనగర్ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి భాష ఇలాగే ఉంటుందా? అని ప్రశ్నించారు.కాంగ్రెస్ కార్యకర్తలు తలచుకుంటే కేసీఆర్ బయట తిరగలేరని తీవ్రంగా హెచ్చరించారు. కేసీఆర్‌కి కష్టం వచ్చిందని మానవత్వంతో మౌనంగా ఉన్నామన్నారు.
Uttam Kumar Reddy: షాకింగ్ న్యూస్ చెప్పిన ఉత్తమ్.. అదే జరిగితే..
తాను జానారెడ్డి లాగా కాదని.. నాపద్ధతి వేరేలాగా ఉంటుందని మందలించారు. కేసీఆర్‌కి చర్లపల్లిలో చిప్పకూడు తినిపిస్తానని ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిన ఊర్లలో లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ ఓట్లు అడగాలని.. తాము ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ఊర్లలో ఓట్లు తాము అడుగుతామని చెప్పారు. తమ పాలన నచ్చితే పార్లమెంట్ ఎన్నికల్లో 14 ఎంపీ స్థానాల్లో గెలిపించాలని కోరారు. తమ పాలన నచ్చకపోతే ఓటేయొద్దని చెప్పారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు.
గంట గంటకు డ్రెస్ మార్చి, చెప్పిన అబద్ధం చెప్పుకుంటూ ఉండే మోదీ ప్రధాని కావాలా? అని ప్రశ్నించారు. రానున్నవి ఎన్నికలు కావు పోరాటమని చెప్పారు. మోదీ కుటుంబానికి, గాంధీ కుటుంబానికి జరుగుతున్న పోరాటం ఇదని అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ, ఎలక్షన్ కమిషన్ మోదీ కుటుంబమని చెప్పారు. ప్రాణ త్యాగం చేసిన ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పదవి త్యాగం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తమ కుటుంబమని చెప్పారు. రాహుల్ గాంధీతో తెలంగాణ కలిసి నడుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
Errabelli Dayakar Rao: ఊహాగానాలకు చెక్.. మళ్లీ మార్చేస్తామంటూ ఎర్రబెల్లి సంచలనం..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...
Updated Date - Apr 06 , 2024 | 10:03 PM