ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: తెలంగాణ ఇక మెడికల్‌ హబ్‌

ABN, Publish Date - Jun 30 , 2024 | 02:47 AM

తెలంగాణ రాష్ట్రాన్ని మెడికల్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని, విద్య, వైద్యం, విద్యుత్తు నిరంతరం ఉండటంతోపాటు ఫార్మా, ఐటీ, టూరిజం, విద్యాసంస్థలు నగరాన్ని ఆ స్థాయిలో నిలిపాయని తెలిపారు.

  • శంషాబాద్‌లో వెయ్యి ఎకరాల్లో మెడికల్‌ టూరిజం

  • ప్రతి పౌరుడికీ ఉచిత వైద్యం అందేలా డిజీ కార్డులు

  • హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ నగరం అభివృద్ధి

  • త్వరలోనే ఎయిర్‌పోర్టు, టెక్స్‌టైల్‌ పార్కు: రేవంత్‌రెడ్డి

  • నగరంలో మెడికవర్‌ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం

  • వరంగల్‌, హనుమకొండల్లో విస్తృతంగా పర్యటన

వరంగల్‌/బాలసముద్రం, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రాన్ని మెడికల్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని, విద్య, వైద్యం, విద్యుత్తు నిరంతరం ఉండటంతోపాటు ఫార్మా, ఐటీ, టూరిజం, విద్యాసంస్థలు నగరాన్ని ఆ స్థాయిలో నిలిపాయని తెలిపారు. కొవిడ్‌ సమయంలో మన దేశంలో వ్యాక్సిన్‌ తయారు చేసిన నాలుగు కంపెనీల్లో మూడు హైదరాబాద్‌కు చెందినవేనని గుర్తు చేశారు. శనివారం వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో సీఎం రేవంత్‌ పర్యటించారు. తొలుత వరంగల్‌ కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కును, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించి.. హనుమకొండ కలెక్టరేట్‌లో వరంగల్‌ నగర అభివృద్ధిపై సమీక్షించారు. అనంతరం హనుమకొండ హంటర్‌ రోడ్డులో నిర్మించిన మెడికవర్‌ మల్టీ నేషనల్‌ ఆస్పత్రిని ప్రారంభించారు.


ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 1965లో ఇందిరాగాంధీ దూరదృష్టితో హైదరాబాద్‌లో ఐడీపీఎల్‌ సంస్థను ఏర్పాటు చేశారని, ఈ సంస్థలో పరిశోధనలు చేసిన ఉద్యోగులు, చూసి నేర్చుకున్నవారే పలు కంపెనీలు నెలకొల్పారని పేర్కొన్నారు. ఆ తరువాత రాజీవ్‌గాంధీ దేశంలో కంప్యూటరీకరణకు శ్రీకారం చుట్టారని, ఫలితంగానే తెలంగాణలో ఐటీ రంగం రాణించిందని, హైదరాబాద్‌కు అదాయం పెరిగిందని అన్నారు. పార్మాసిటీలే కాకుండా తెలంగాణలో 10 నుంచి 12 వరకు ఫార్మా విలేజ్‌లను ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. మిడిల్‌ ఈస్ట్‌ దేశాలు మనపై ఆధారపడుతున్నాయని, అక్కడివారు వైద్యం కోసం హైదరాబాద్‌, చెన్నై నగరాలకు వస్తున్నారని చెప్పారు.


శంషాబాద్‌లో మెడికల్‌ టూరిజం..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో వెయ్యి ఎకరాల్లో మెడికల్‌ టూరిజం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పేద ప్రజలకు వైద్య సేవలందించే సంస్థలకు ఉచితంగా స్థలాలు కేటాయించటంతోపాటు మౌలిక సదుపాయాలు కూడా ప్రభుత్వమే కల్పిస్తుందన్నారు. ఎయిర్‌పోర్టులో గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు చేసి, వైద్యం కోసం వచ్చేవారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ఉచిత వైద్యం అందేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వైద్యం అందక ఏ ఒక్కరు కూడా మృతి చెందారనే వార్త వినబడవద్దన్నారు. ప్రతి ఒక్కరికీ హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు చేసి, యునిక్‌ నంబరుతో డిజిటల్‌ కార్డులు ఇస్తామని, ఈ కార్డు ద్వారా ఏ ఆస్పత్రిలోనైనా ఉచితంగా చికిత్స పొందేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని వివరించారు. ఇక వరంగల్‌ నగరాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలోనే వరంగల్‌కు ఎయిర్‌పోర్టు, మాస్టర్‌ ప్లాన్‌ వస్తున్నాయని తెలిపారు.


టెక్స్‌టైల్‌ పార్కును అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. హెల్త్‌, ఎడ్యుకేషన్‌, ఎకో, టెంపుల్‌ టూరిజం అన్నీ వరంగల్‌లోనే అభివృద్ధి చేసుకునే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందని తెలిపారు. వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఉండే అతి పెద్ద మెడికవర్‌ ఆస్పత్రిని వరంగల్‌లో ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం తరఫున అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ కడియం కావ్య, నగర మేయర్‌ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2024 | 02:47 AM

Advertising
Advertising