IPL 2025: తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు.. ఎవరీ అశ్వనీ కుమార్
ABN , Publish Date - Mar 31 , 2025 | 09:25 PM
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతో మంది యువ ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకొస్తోంది. తాజాగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ మరో యంగ్ ట్యాలెంట్‌కు గుర్తింపు తీసుకొచ్చింది. కెరీర్‌లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న ముంబై బౌలర్ అశ్వనీ కుమార్ ఆకట్టుకున్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) ఎంతో మంది యువ ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకొస్తోంది. తాజాగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ (MI vs KKR) మరో యంగ్ ట్యాలెంట్‌కు గుర్తింపు తీసుకొచ్చింది. కెరీర్‌లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న ముంబై బౌలర్ అశ్వనీ కుమార్ (Ashwani Kumar) ఆకట్టుకున్నాడు. వేసిన తొలి బంతికే వికెట్ తీశాడు. మొత్తం 3 ఓవర్లు వేసి 24 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఎవరీ అశ్వనీ కుమార్ అనే ఆసక్తి చాలా మందిలో మొదలైంది.
23 ఏళ్ల ఈ అశ్వనీ కుమార్ పంజాబ్‌లోని మొహలీకి చెందిన వాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పంజాబ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2022లో పంజాబ్ తరఫున సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఆడాడు. ముఖ్యంగా షేర్-ఎ-పంజాబ్ టీ20 క్రికెట్ లీగ్‌లో సత్తా చాటి అందరి దృష్టిలో పడ్డాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతడి బౌలింగ్ చాలా మందిని ఆకట్టుకుంది. పంజాబ్ టీమ్ 2024లో అశ్వనీ కుమార్‌ను వేలంలో దక్కించుకుంది. అయితే అప్పుడు అశ్వనీకి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.
2025లో జరిగిన మెగా వేలంలో ముంబై టీమ్ అశ్వనీ కుమార్‌ను రూ.30 లక్షలకు దక్కించుకుంది. ఈ సీజన్‌లో ముంబై ఆడిన తొలి రెండు మ్యాచ్‌లల్లో ఆడే అవకాశం అశ్వనీకి రాలేదు. తాజాగా వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో అశ్వనీకి అవకాశం ఇచ్చారు. అందివచ్చిన అవకాశాన్ని అశ్వనీ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. తొలి బంతికే కోల్‌కతా కెప్టెన్ అజింక్యా రాహానే వికెట్ తీశాడు. తొలి మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి కోల్‌కతా పతనాన్ని శాసించాడు.
ఇవి కూడా చదవండి..
MS Dhoni: కీలక సమయంలో ధోనీ అవుట్.. చెన్నై అభిమాని రియాక్షన్ చూస్తే
Malaika Arora: మలైకాకు కొత్త బాయ్‌ఫ్రెండ్.. 51 ఏళ్ల వయసులో మాజీ క్రికెటర్‌తో డేటింగ్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..