ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Komatireddy Venkat Reddy: హాఫ్‌ నాలెడ్జ్‌.. ఫుల్‌ నాలెడ్జ్‌!

ABN, Publish Date - Jul 28 , 2024 | 03:28 AM

బడ్జెట్‌పై చర్చలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు మధ్య వాడివేడి చర్చ జరిగింది. హరీశ్‌.. కోమటిరెడ్డిని ‘హాఫ్‌ నాలెడ్జ్‌’ అని విమర్శించారు.

  • మంత్రి కోమటిరెడ్డిపై హరీశ్‌ వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్‌

హైదరాబాద్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): బడ్జెట్‌పై చర్చలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు మధ్య వాడివేడి చర్చ జరిగింది. హరీశ్‌.. కోమటిరెడ్డిని ‘హాఫ్‌ నాలెడ్జ్‌’ అని విమర్శించారు. కోమటిరెడ్డి స్పంది స్తూ హరీశ్‌కు ఆకారం పెరిగింది కానీ.. నాలెడ్జ్‌ పెరగలేదని, ఆయనదే హాఫ్‌ నాలెడ్జ్‌ అని మండిపడ్డారు. సీఎం రేవంత్‌ రెడ్డి జోక్యం చేసుకుని హరీశ్‌కు హాఫ్‌ నాలెడ్జ్‌.. పెద్దాయనకేమో (కేసీఆర్‌కు) ఫుల్‌ నాలెడ్జ్‌ (ఫుల్‌ బాటిల్‌ అర్థం వచ్చేలా మోచేయి పైకెత్తి) అని వ్యాఖ్యానించారు. తొలుత హరీశ్‌ మాట్లాడుతుండగా కోమటిరెడ్డి జోక్యం చేసుకుని, హరీశ్‌ వైఖరి సభను తప్పుదోవ పట్టించేలా ఉందని అభ్యంతరం తెలిపారు.


గంటన్నర మాట్లాడినా బడ్జెట్‌ గురించి ప్రస్తావన లేదని విమర్శించారు. ‘2001లో టీఆర్‌ఎస్‌ పెట్టినప్పుడు.. తెలంగాణ ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడన్నారు. దళితుడిని సీఎం చేయకపోతే మెడ మీద తల తీసుకుంటామన్నారు. ఆ రోజు మొదలయ్యాయి.. అబద్ధాలంటే వీళ్లవి. గ్యారెంటీలంటే వీళ్లవి. ఇయ్యాల హరీశ్‌రావు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. హరీశ్‌రావు గారూ.. నీ దగ్గర సబ్జెక్టు లేదు. నిన్న కేసీఆర్‌ గారు ప్రెస్‌మీట్‌లో రేపు కాంగ్రెస్‌ బడ్జెట్‌ మీద చీల్చిచెండాడతానంటే నేను ఉదయం 9.30 గంటలకు వచ్చి సభలో కూర్చున్నాను. వచ్చే ముఖం లేక ఈయనను (హరీశ్‌ను) పంపించిన్రు. మా బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.70 వేల కోట్లు, ఇరిగేషన్‌కు రూ.20 వేల కోట్లు పెట్టాం. చీల్చిచెండాడే మొనగాడు.. కేంద్రం చేసిన అన్యాయంపై ఒక్కమాట కూడా మాట్లాడలేద’ని కోమటిరెడ్డి విమర్శించారు.


హరీశ్‌ బదులిస్తూ ‘కోమటిరెడ్డికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా.. నా బాధేందీ అంటే.. ఆయనకేమో హాఫ్‌ నాలెడ్జ్‌’ అని వ్యాఖ్యానించారు. ‘యస్‌.. యువారే హాఫ్‌ నాలెడ్జ్‌ ఫెలో’ అని కోమటిరెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఆ మాటను ఉపసంహరించుకోవాలని స్పీకర్‌ సూచించారు. ‘మీకు ఇబ్బంది ఉంటే తొలగించుకోండి. నాకెలాంటి అభ్యంతరం లేద’ని హరీశ్‌ చెప్పారు. దాంతో ఆ పదాన్ని తొలగించాలని స్పీకర్‌ ఆదేశించారు. కోమటిరెడ్డి మైక్‌ అందుకొని ‘హరీశ్‌రావుకు ఆకారం పెరిగింది కానీ నాలెడ్జ్‌ లేదు. ఆయనదే హాఫ్‌ నాలెడ్జ్‌. ఆకారం పెరిగితే సరిపోదు బుద్ధుండాలి. ఆయనొక డమ్మీ మినిస్టర్‌, డమ్మీ అల్లుడు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మీ మామ అన్నడా లేదా చెప్పు’ అని మండిపడ్డారు. హరీశ్‌ బదులిస్తూ ‘ఇదే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రూ.50 కోట్లకు రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నాడని ఆరోపించార’న్నారు. సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకొని ‘వెంకట్‌రెడ్డిగారు ఒకమాట చెప్పారు.. ఆయనకేమో (హరీశ్‌కు) హాఫ్‌ నాలెడ్జ్‌... పెద్దాయనకేమో (కేసీఆర్‌కు) ఫుల్‌ నాలెడ్జ్‌ (ఫుల్‌ బాటిల్‌ అర్థం వచ్చేలా మోచేయి పైకి ఎత్తుతూ) అని వ్యాఖ్యానించారు. ఇక తామేం చేస్తాం అధ్యక్షా అని ప్రశ్నించారు.

Updated Date - Jul 28 , 2024 | 03:28 AM

Advertising
Advertising
<