Hyderabad: సూచిక బోర్డును కప్పేసి.. కబ్జాకు స్కెచ్ వేశాడుగా..
ABN , Publish Date - Jun 11 , 2024 | 11:10 AM
బంజారాహిల్స్ రోడ్డు నంబరు-5(Banjarahills Road No-5)లో వార్డు నంబరు-11లో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు ఓ నిర్మాణ దారుడు స్కెచ్ వేశాడు. పసిగట్టిన రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టి సూచిక బోర్డు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్డు నంబరు-5(Banjarahills Road No-5)లో వార్డు నంబరు-11లో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు ఓ నిర్మాణ దారుడు స్కెచ్ వేశాడు. పసిగట్టిన రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టి సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. కానీ సదరు నిర్మాణ దారుడు బాహ్యాప్రపంచానికి ఉండేందుకు సూచిక బోర్డును బయటకు కనిపించకుండా కప్పే బహుళ అంతస్థుల భవనాలు నిర్మించేందుకు సెల్లార్ పనులు మొదలు పెట్టాడు. స్థలం చుట్టూ రక్షణగా నీలి రంగు రేకులు ఏర్పాటు చేశాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.
ఇదికూడా చదవండి: Hyderabad: మీరు ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా.. అయితే.. ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే..
నిర్మాణం జరుగుతున్న వెనుక బాగాన ప్రభుత్వానికి చెందిన 600 గజాల ఖాళీ స్థలం ఉంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో నిర్మాణ దారుడు తన రేకులు ప్రభుత్వ స్థలం వైపు విస్తరించాడు. చూసే వారికి ఆ స్థలం కూడా తన నిర్మాణంలోకే వస్తుందనేలా పనులు చేస్తున్నాడు. పది రోజుల క్రితం రెవెన్యూ సిబ్బంది తనిఖీలు చేపట్టగా ప్రభుత్వ స్థలం కనిపించలేదు. ఆరా తీయగా నిర్మాణ దారుడి కుట్ర వెలుగులోకి వచ్చింది. వెంటనే తహసీల్దార్ అనితారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆమె దగ్గరుండి ఎక్స్‌కవేటర్‌తో రేకులు తీయించారు. స్థలంలో ప్రభుత్వ సూచిక బోర్డు ఏర్పాటు చేసి నిర్మాణ దారుడికి హెచ్చరికలు జారీ చేసి వెళ్లిపోయారు.
అయినా నిర్మాణ దారుడికి స్థలం మోజు తీరలేదు. విష యం బయటకు పొక్కకుండా ఉండేందుకు తాజాగా సూచిక బోర్డును వస్త్రంతో కప్సేసి పనులు చేపడుతున్నాడు. ఈ విషయంపై తహసీల్దార్ అనితారెడ్డిని ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా ప్రభుత్వ స్థలం ఆక్రమణ గురించి తెలిసి కూల్చివేతలు చేపట్టినట్టు చెప్పారు. సూచిక బోర్డును కప్పేసి నిబంధనలను ఉల్లంఘిస్తే నిర్మాణ దారుడిపై చట్టరిత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా వర్షాకాలంలో భారీ సెల్లార్‌కు జీహెచ్‌ఎంసీ ఎలా అనుమతులు ఇచ్చిందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ సెల్లార్ తమకు ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయని స్థానికులు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News