Share News

Hyderabad: సిటీ బస్సుల్లో.. డిజిటల్‌ చెల్లింపులు

ABN , Publish Date - Jul 11 , 2024 | 10:48 AM

ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్‌ చెల్లింపులతో ప్రయాణికులకు బస్‌ టికెట్లు ఇచ్చేలా గ్రేటర్‌ ఆర్టీసీ(Greater RTC) చర్యలు తీసుకుంటోంది. ఐటిమ్స్‌ (ఇంటెలిజెంట్‌ టికెట్‌ ఇష్యూ మిషన్‌)తో గూగుల్‌ పే, ఫోన్‌పే, డెబిట్‌, క్రెడిట్‌కార్డులతో(Google Pay, PhonePay, Debit, Credit Cards) పాటు ఇతర డిజిటల్‌ చెల్లింపులను అంగీకరించనున్నారు.

Hyderabad: సిటీ బస్సుల్లో.. డిజిటల్‌ చెల్లింపులు

హైదరాబాద్‌ సిటీ: ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్‌ చెల్లింపులతో ప్రయాణికులకు బస్‌ టికెట్లు ఇచ్చేలా గ్రేటర్‌ ఆర్టీసీ(Greater RTC) చర్యలు తీసుకుంటోంది. ఐటిమ్స్‌ (ఇంటెలిజెంట్‌ టికెట్‌ ఇష్యూ మిషన్‌)తో గూగుల్‌ పే, ఫోన్‌పే, డెబిట్‌, క్రెడిట్‌కార్డులతో(Google Pay, PhonePay, Debit, Credit Cards) పాటు ఇతర డిజిటల్‌ చెల్లింపులను అంగీకరించనున్నారు. బండ్లగూడ డిపో(Bandlaguda Depot) పరిధిలో అధికారులు ఐటిమ్స్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఐటిమ్స్‌ వినియోగంపై కండక్టర్లకు శిక్షణ ఇవ్వడంతో పాటూ రద్దీ సమయంలో ఎలాంటి సమస్యలు వస్తున్నాయో గుర్తిస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌-పఠాన్‌చెరు (218) రూట్‌లో ఐటిమ్స్‌తో టికెట్లు జారీ చేస్తున్నట్లు డిపో డీఎం డి.హరి తెలిపారు.

ఇదికూడా చదవండి: Hyderabad: మియాపూర్-పటాన్‏చెరువు రూట్‏లో డబుల్ డెక్కర్ బస్సులు


city31.jpg

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 11 , 2024 | 10:48 AM