Hyderabad: ఓట్ల కోసం రీల్స్, వీడియోలు.. అభ్యర్థుల ‘స్మార్ట్’ ప్రచారం
ABN, Publish Date - May 07 , 2024 | 12:03 PM
ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు కలిసొచ్చే ప్రతి అంశాన్ని వాడుకుంటున్నారు. ఒకవైపు పాతపద్ధతిలో ఇంటింటి ప్రచారం చేస్తూనే మరోవైపు స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు. సోషల్ మీడియా(Social media)తో ‘స్మార్ట్‘గా ప్రచారం చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
హైదరాబాద్: ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు కలిసొచ్చే ప్రతి అంశాన్ని వాడుకుంటున్నారు. ఒకవైపు పాతపద్ధతిలో ఇంటింటి ప్రచారం చేస్తూనే మరోవైపు స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు. సోషల్ మీడియా(Social media)తో ‘స్మార్ట్‘గా ప్రచారం చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. సరికొత్త సినిమా పాటలతో నేతల ప్రచార వీడియోలను ‘షార్ట్స్‘గా మార్చి వైరల్ చేస్తున్నారు. సెల్‌ఫోన్, కంప్యూటర్లకు(Cell phones and computers) అతుక్కునే యువత, మహిళలు, ఉద్యోగ, వ్యాపారులతో బిజీగా ఉండే వారిని ఇట్టే ఆకట్టుకుంటున్నారు. మరోవైపు దీనికి ఖర్చు తక్కువ కావడంతో అభ్యర్థులు సైతం దీనిని నమ్ముకొంటున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా నిత్యం ఓటర్లకు అందుబాటులో ఉంటున్నారు.
ఇదికూడా చదవండి: Union Minister: ఎన్డీఏ కూటమికి 400కు పైగా స్థానాలు..
ఓ ప్రధాన పార్టీ దాదాపుగా 15 లక్షలకు పైగా వాట్సాప్ నెంబర్లను సేకరిస్తే మరో పార్టీ పదిలక్షలకు పైగా వాట్సాప్ నెంబర్లను(WhatsApp numbers) సేకరించి సోషల్‌మీడియా ప్రచారంలోనూ తిరుగుతలేదనిపిస్తున్నాయి. వాటితో పాటు బ్రాడ్‌కాస్ట్ గ్రూపులకు ఒకేసారి మెసేజ్‌లను పంపించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. య్యూటూబ్ షార్ట్స్, ఆకర్షించే వీడియోస్‌తో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, వాట్సాప్(Facebook, Instagram, X, WhatsApp) ఇలా ప్రతివేదికలో ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఒక్కో వాట్సాప్ గ్రూప్‌లో రోజుకి పది రీల్స్ చొప్పున అభ్యర్థుల ప్రచారాన్ని వైరల్ చేస్తున్నారు. ప్రతి రీల్స్‌లో కొత్తదనం ఉండేలా.. ప్రసంగాల్లో ముఖ్యమైన అంశాలను ఆకర్షించేలా రీల్స్ చేసి జనం ఫోన్లలోకి వెళ్లేలా చేస్తున్నారు. ఇంటింటి ప్రచారం కాదు.. ఇంట్లోని అందరి సెల్‌ఫోన్స్‌కు ప్రచారం రీచ్ అయ్యేలా చూస్తున్నారు.
ఇదికూడా చదవండి: Secunderabad: రోజుకో కండువా.. పూటకో గుర్తు
Read Latest News and Telangana News Here
Read Latest National News and Telugu News
Updated Date - May 07 , 2024 | 12:03 PM