ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BL Santosh: తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉంది

ABN, Publish Date - Aug 04 , 2024 | 05:08 PM

తెలంగాణలో తమ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ (BL Santosh) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు బీజేపీ కార్యాలయానికి బీఎల్ సంతోష్ వచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శులతో బీజేపీ అగ్రనేత సమావేశమయ్యారు.

BL Santosh

హైదరాబాద్: తెలంగాణలో తమ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ (BL Santosh) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు బీజేపీ కార్యాలయానికి బీఎల్ సంతోష్ వచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శులతో బీజేపీ అగ్రనేత సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కమలం నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో బీఎల్ సంతోష్ మాట్లాడుతూ.. బీజేపీ నేతలు, కార్యకర్తలు కలి‌సి కట్టుగా పని చేయాలని సూచించారు.


ప్రజా సమస్యలపై తీసుకున్న పోరాటాలపై ఆరా తీశారు. పార్టీ బలహీనంగా ఉన్న చోట మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలపై పోరాటం చేయాలని అన్నారు. ప్రజలకు అండగా ఉండాలని చెప్పారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించాలని ఆదేశించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో గోషమహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో బీఎల్ సంతోష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలపై చర్చించారు. జాతీయ నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాల అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం పార్టీ పరిస్థితిపై ముఖ్య నేతలతో బీఎల్ సంతోష్ మాట్లాడారు.


6న ఆఫీస్ బేరర్స్ మీటింగ్

బీజేపీ పదాధికారుల సమావేశం ఈనెల 6న కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరగనుంది. రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. తాజా రాజకీయాలు, రుణమాఫీ, నిరుద్యోగుల సమస్యలు, మహిళా సమస్యలపై పదాధికారులు చర్చించనున్నారు. ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొననున్నారు. ఈనెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బీజేపీ ఆధ్వర్యంలో ‘‘హర్ ఘర్ తిరంగా’’ కార్యక్రమం ఘనంగా చేయనున్నారు. ఈ వేడుక కోసం బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Aug 04 , 2024 | 05:19 PM

Advertising
Advertising
<