ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను టార్గెట్ చేస్తూ కేటీఆర్ ట్వీట్..

ABN, Publish Date - Oct 19 , 2024 | 11:16 AM

తెలంగాణ ప్రభుత్వానికి మద్యంపై ఉన్న ధ్యాస రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు లేదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్వీట్ చేశారు. మందుపై ఉన్న ధ్యాస మంచి బోధన, మందుబిళ్లలు, మూసీ బాధితులు, మంచినీళ్లపై లేదన్నారు.

BRS Working President KTR

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డి సీఎం కుర్చీని కాపాడేందుకు బండి సంజయ్ తాపత్రయ పడుతున్నారంటూ ట్విటర్ వేదికగా కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా? లేక బీజేపీ అనుబంధ ప్రభుత్వమా? అంటూ కేటీఆర్ ప్రశ్నలు సంధించారు.


ముఖ్యమంత్రి సీటు నుంచి రేవంత్ రెడ్డిని దించేందుకు కాంగ్రెస్ మంత్రులే కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. వారు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని.. మూసీ, హైడ్రా, గ్రూప్- 1 విషయంలో సీఎం రేవంత్ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టపోతారని హెచ్చరించారు. హైడ్రా, గ్రూప్-1 పరీక్షల ఆందోళలను మంత్రులు తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డిని కాపాడేందుకు బండి సంజయ్ తపిస్తున్నారని, తెలంగాణలో ఉన్నది బీజేపీ అనుబంధ ప్రభుత్వంలా కనిపిస్తోందంటూ కేటీఆర్ చురకలు అంటిస్తూ ట్వీట్ చేశారు.


తెలంగాణ ప్రభుత్వానికి మద్యంపై ఉన్న ధ్యాస రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు లేదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. మందుపై ఉన్న ధ్యాస మంచి బోధన, మందుబిళ్లలు, మూసీ బాధితులు, మంచినీళ్లపై లేదన్నారు. అలాగే పింఛన్ల పెంపుపై సీఎంకు శ్రద్ధ లేదన్నారు. ప్రభుత్వానికి మద్యంపై ఉన్న ధ్యాస రైతు భరోసా పెంపుపై లేదని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై అడ్డగోలు ఆరోపణలు చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డగోలుగా ధరలు పెంచేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు పెంచుకో - దంచుకో - పంచుకో అన్న చందంగా ఉందని విమర్శించారు. నేడు మద్యం ధరల పెంచారని, రేపు ఏం పెంచుతారో, ఎంతెంత వసూలు చేస్తారో చూడాలంటూ ట్విటర్ వేదికగా కేటీఆర్ విమర్శించారు.


కేటీఆర్ ట్వీట్ ఇదే..

మద్యంపై ఉన్న ధ్యాస - మద్దతు ధరపై లేకపాయే

మద్యంపై ఉన్న ధ్యాస - మంచి బోధనపై లేకపాయే

మద్యంపై ఉన్న ధ్యాస - మందుబిళ్లలపై లేకపాయే

మద్యంపై ఉన్న ధ్యాస - మూసీ బాధితులపై లేకపాయే

మద్యంపై ఉన్న ధ్యాస - మంచినీళ్లపై లేకపాయే

మద్యంపై ఉన్న ధ్యాస - పింఛన్ పెంపుపై లేకపాయే

మద్యంపై ఉన్న ధ్యాస - భరోసా పెంపుపై లేకపాయే

10 తగ్గిస్తే పగబట్టి 10కి 10 కలిపి మరి పెంచుతాం అనబట్టే

నాడు అడ్డగోలు ఆరోపణలు నేడు అడ్డగోలు ధరల పెంపు

పెంచుకో - దంచుకో - పంచుకో.. నేడు మద్యం ధరల పెంపు,

రేపు రేపు ఏం పెంపో ఏన్నెన్ని పెంపో


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: గబ్బు రేపుతున్న హైదరాబాద్ పబ్బులు..

TG News: ముగ్గురు యువకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు చూస్తే..

TG News: ప్రేమించిన యువతి దూరం పెట్టడంతో సహించలేని ఓ యువకుడు ఏం చేశాడంటే

Updated Date - Oct 19 , 2024 | 11:16 AM