ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: ఇందిరమ్మ రాజ్యమని దళారుల రాజ్యం తెచ్చారు: కేటీఆర్..

ABN, Publish Date - Oct 15 , 2024 | 10:41 AM

తెలంగాణలో వ్యవసాయ, విద్యా, విద్యుత్ రంగాలు అధ్వానంగా మారాయని బీర్ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురుకులాల బిల్డింగులకు కనీసం అద్దె చెల్లించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచి అన్నీ రంగాలు కుదేలయ్యాయని బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు అన్నారు. వ్యవసాయ, విద్యా, విద్యుత్ రంగాలు అధ్వానంగా మారాయని బీర్ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గురుకులాల బిల్డింగులకు కనీసం అద్దె చెల్లించలేక విద్యార్థులను రోడ్డుపైకి తెచ్చారని హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలూ ట్విటర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.


కేటీఆర్ ట్వీట్ ఇదే..

"బడా భాయ్ (ప్రధాని మోదీ) రాష్ట్రంలో పత్తి రైతులకు పట్టాభిషేకం జరుగుతుంటే చోటా భాయ్ (రేవంత్ రెడ్డి) పాలనలో మాత్రం పత్తి రైతులు చిత్తు అయ్యారు. గుజరాత్‌లో మద్దతు ధరకు మించి క్వింటా పత్తి ధర రూ.8,257 పలుకుతోంది. కానీ తెలంగాణలో క్వింటా ధర కేవలం రూ.5వేలేనా?. రెండేళ్ల కిందట పత్తి క్వింటా ధర 10 నుంచి 15 వేల వరకూ పలికింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరిస్థితి మారింది. మార్కెట్‌కు దిగుబడి వచ్చినా సీసీఐ కేంద్రాలెక్కడ?. ఇందిరమ్మ రాజ్యమని దళారుల రాజ్యం తెస్తారా?. నిన్న పెట్టుబడి సాయం అందించలేదు, నేడు కష్టించి పండించినా పంట కొనుగోలు చేయరా?. పత్తి రైతుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటం ఆడుతోంది. ముందుచూపు లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్లే పత్రి రైతులకు రాష్ట్రంలో అన్యాయం జరుగుతోంది.


బాదుడే బాదుడు..

కరెంట్ కోతల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇప్పుడు వాతలు పెట్టేందుకు రెడీ అవుతోంది. విద్యుత్ సరఫరాకు గ్యారెంటీ లేదు కానీ విద్యుత్ షాకులకు మాత్రం గ్యారెంటీ ఇస్తోంది. పవర్‌లోకి వచ్చి ఏడాది కాకముందే పవర్ ఛార్జీలు పెంచి జనం మీద భారం మోపడానికి సిద్ధమయ్యారు. ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి దాన్ని అటకెక్కించారు. గృహజ్యోతి పథకం ఇంకా గ్రహణంలోనే ఉంది. జీరో బిల్లుల కోసం ఎదురు చూస్తుంటే గుండె గుబేలు మనేలా కొత్త బాదుడు షురూ చేస్తారా?. ఒక్క గ్యారెంటీ అయినా సరిగా అమలు చేసింది లేదు. 420 హామీలకు అతీగతీ లేదు. రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి ఏం చేస్తున్నారు.?. 9 నెలల్లో ఎడాపెడా అప్పులు చేసి తెచ్చిన రూ.77వేల కోట్లు ఎటుపోయాయి?. అవి సరిపోక మళ్లీ ప్రజల నడ్డి విరిగే వడ్డనలు ఎందుకు?. అసమర్థుల పాలనలో ఆఖరికి మిగిలేది కోతలూ వాతలే" అని అన్నారు.


అద్దెలు చెల్లించలేరా?

"10 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురుకులాల పరిస్థితి అధ్వానంగా మారింది. అద్దె రాకపోవడంతో ఓ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ భవన యజమాన్ని పాఠశాలకు తాళం వేశారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాల నిర్వహణ అధ్వాన స్థితికి చేరుకుందని చెప్పడానికే ఇది మరో నిదర్శనం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.. గురుకులాలకు అద్దెలు ఇంకెప్పుడు చెల్లిస్తారు?. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థ రోజురోజుకీ దిగజారిపోతోంది. దీనిపై విద్యా శాఖ మంత్రిగా ఉన్న మీరు ఇంకెప్పుడు పట్టించుకుంటారు?" అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: హయత్‌నగర్‌ టు ఆటోనగర్‌.. 3 కి.మీ.లకు ఒకే యూటర్న్‌

DSC 2024: టీచర్ పోస్టింగులు వాయిదా

Updated Date - Oct 15 , 2024 | 10:46 AM