ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chada Venkat Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీపై పోరాటానికి సిద్ధం కావాలి

ABN, Publish Date - Jul 27 , 2024 | 10:25 PM

కేంద్ర ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరిగిన తెలంగాణకు మాత్రం తీవ్రమైన అన్యాయం చేశారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు.

మహబూబ్ నగర్: కేంద్ర ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరిగిన తెలంగాణకు మాత్రం తీవ్రమైన అన్యాయం చేశారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. బయ్యారం ఉక్కు, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదాకు సంబంధించిన ఊసే లేదని మండిపడ్డారు. మహబూబ్ నగర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో శనివారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం తమకు బకాయిలు ఇచ్చే వారికే బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు.


ఈ ప్రాంత ఎంపీలు కేంద్రాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర బడ్జెట్ విషయానికొస్తే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలును వేగవంతం చేయాలని కోరారు. ధరణిలో ఉన్న లొసుగులు పూడ్చాలంటే క్షేత్ర స్థాయిలో సమగ్ర విశ్లేషణ జరగాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీపై పోరాటానికి సిద్ధం కావాలన్నారు. అలా అయితేనే పాలమూరుకు జాతీయ హోదా సాధ్యం అవుతుందని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు ఇంకా అధికార పక్ష పోకడలు వదిలి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని అన్నారు. పాలమూరు యూనివర్సిటీకి ప్రత్యేక నిధులు కేటాయించేలా ముఖ్యమంత్రిను కలుస్తామని అన్నారు.


బీఆర్ఎస్‌పై సంపత్ ఫైర్..

మహబూబ్‌నగర్: బీఆర్ఎస్ నేతలపై ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మహబూబ్‌నగర్ కాంగ్రెస్ కార్యాలయంలో సంపత్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కుట్ర పూరితంగా గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే... బీఆర్ఎస్ నాయకులు ఆర్డీఎస్‌కు నీళ్లు రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన సకాలంలో సాగునీరుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రైతులు నిర్భయంగా పంటలు పండించుకోవచ్చని, సాగునీరును పుష్కలంగా అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ నేతలు చేసే ఆరోపణలను నమ్మొద్దని సంపత్ కుమార్ అన్నారు.


రైతులకు రుణమాఫీ: మండవ వెంకటేశ్వరరావు

నిజామాబాద్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏకకాలంలో రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకుందని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు (Mandava Venkateswara Rao) తెలిపారు. డిచ్‌పల్లి మండలం ధర్మరాం (బి) గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండవ మాట్లాడుతూ... రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. సాంకేతిక ఇబ్బందులతో కొంత మందికి రుణమాఫీ డబ్బులు జమ కాలేదని అన్నారు. అన్ని సమస్యలు పరిష్కరించి వెంటనే అర్హులైన వారికి రుణమాఫీ డబ్బులు జమ చేస్తామని అన్నారు. రుణమాఫీ కాని రైతులు ఏఈఓలను సంప్రదించాలని అన్నారు. ధరణిలో ఇబ్బందులతో కొందరికి రుణమాఫీ అందలేదని చెప్పారు. రైతులు రుణమాఫీతో అప్పుల బాధ నుంచి కొంత ఉపశమనం పొందుతారని ఆశిస్తున్నానని మండవ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 02:43 PM

Advertising
Advertising
<