Share News

CPM: సీతారాం ఏచూరి మృతి పార్టీకి తీరని లోటు.. సీపీఎం నేతల ఆవేదన

ABN , Publish Date - Sep 14 , 2024 | 04:21 PM

Telangana: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పార్టీకి తీరని లోటని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ సీపీఎంలో ఏ కార్యక్రమం జరిగినా సీతారాం ఏచూరి ఉండేవారన్నారు. సీతారాం ఏచూరిని కోల్పోవడం బాధాకరమన్నారు.

CPM: సీతారాం ఏచూరి మృతి పార్టీకి తీరని లోటు.. సీపీఎం నేతల ఆవేదన
CPM Leaders

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూ CPM National General Secretary Sitaram( Yechuri) రి మృతి పార్టీకి తీరని లోటని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Telangana CPM State Secretary Tammineni Veerbhadram) అన్నారు. తెలంగాణ సీపీఎంలో ఏ కార్యక్రమం జరిగినా సీతారాం ఏచూరి ఉండేవారన్నారు. సీతారాం ఏచూరిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.

Nirmala Sitharaman: క్షమాపణ చెప్పారా.. చెప్పించారా.. నిర్మలా ఎపిసోడ్‌లో అసలు ఏం జరిగింది..


అత్యంత బాధాకరం..

సీతారాం ఏచూరి మృతి అత్యంత బాధాకరమని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఆయన అన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారావు మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి మృతి తీరనిలోటన్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెబుతూ.. సీతారం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Viral News: ఇలా తయారయ్యారేంట్రా.. జ్యూస్‌లో మూత్రం కలిపి..


ఏచూరి కోరిక మేరకే: రాఘవులు

సీఎం నేత రాఘవులు మాట్లాడుతూ.. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏచూరి భౌతికకాయాన్ని ఎయిమ్స్‌కు అందజేయనున్నామన్నారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి చివరిదశలో కూడా ప్రజాల కోసమే ఆలోచించారన్నారు. తన మరణానంతరం శరీరాన్ని పరిశోధనలకు ఉపయోగపడాలని భావించారన్నారు. వారి కోరిక మేరకు కామ్రేడ్ ఏచూరి భౌతికకాయాన్ని ఎయిమ్స్‌కు అందిస్తున్నామని తెలిపారు. ఏచూరి మరణం వామపక్ష ఉద్యమలకే కాదు, ప్రజాస్వామ్య వాదులకు తీరని నష్టమన్నారు. వారి స్పూర్తితో వామపక్ష ఉద్యమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని రాఘవులు వెల్లడించారు. మరోవైపు సీతారాం ఏచూరి పార్థివ దేహానికి మాజీ ఎంపీ చింత మోహన్ నివాళులర్పించారు. ఏచూరి మృతి దేశానికి తీరని లోటన్నారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


ఇవి కూడా చదవండి...

TG News: ఆస్తి కోసం బావ ఎంతటి దారుణానికి పాల్పడ్డాడంటే

TG News: గంజాయి పట్టివేతపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఏమన్నారంటే?

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 14 , 2024 | 04:22 PM