ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi Police: అమిత్ షా డీప్‌ ఫేక్ వీడియో కేసులో నలుగురు తెలంగాణ వారే...

ABN, Publish Date - Apr 29 , 2024 | 04:51 PM

Telangana: కేంద్ర మంత్రి అమిత్‌ షా డీప్‌ ఫేక్ వీడియో అంశం దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతోంది. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఫేక్ వీడియోను వైరల్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసులు గాంధీభవన్‌కు చేరుకున్నారు. 91 కింద నోటీసులు ఇస్తామని గాంధీభవన్ సిబ్బందికి అధికారులు తెలిపారు.

Delhi Police to Gandhi Bhavan

హైదరాబాద్, ఏప్రిల్ 29: కేంద్ర మంత్రి అమిత్‌ షా (Union minister Amit Shah) డీప్‌ ఫేక్ వీడియో (Deep Fake Video) అంశం దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతోంది. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఫేక్ వీడియోను వైరల్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసులు గాంధీభవన్‌కు (Gandhi Bhavan) చేరుకున్నారు. 91 కింద నోటీసులు ఇస్తామని గాంధీభవన్ సిబ్బందికి అధికారులు తెలిపారు. అయితే ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా 10 మందికి నోటీసులు ఇవ్వగా అందులో నలుగురు తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందిన మన్నె సతీష్, నవీన్, శివకుమార్, తస్లీమలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Lok Sabha Elections 2024: రిజర్వేషన్లు తీసేస్తే బీజేపీ నేతలను తరిమి కొడతారు: మంత్రి ప్రభాకర్


కాగా.. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని కేంద్రమంత్రి అమిత్ షా పేరుతో ఫేక్ వీడియోను కాంగ్రెస్ వైరల్ చేసింది. దీనిపై బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారన్న దానిపై స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ (IFSO) దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగానే గాంధీభవన్‌కు వచ్చిన ఢిల్లీ పోలీసులు.. సోషల్ మీడియా ఇంచార్జ్‌కు నోటీసులు ఇచ్చారు. మరోవైపు డీప్ ఫేక్ వీడియోలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని కర్ణాటక సభలో ప్రధాని నరేంద్ర మోదీ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి...

AP HighCourt: పులివర్తి నానికి 1+1 సెక్యూరిటీ ఇవ్వాలి.. హైకోర్ట్ ఆదేశం

AP Elections 2024: ముగిసిన నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు.. ట్విస్ట్ ఏమిటంటే..?

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 29 , 2024 | 04:54 PM

Advertising
Advertising