Kishan Reddy: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తా..: కిషన్ రెడ్డి
ABN , Publish Date - Jun 10 , 2024 | 12:50 PM
న్యూఢిల్లీ: మోదీ కేబినెట్లో మరోసారి చోటు దక్కడం చాలా సంతోషంగా ఉందని, ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలుపుతున్నానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
న్యూఢిల్లీ: మోదీ కేబినెట్(Modi Cabinet)లో మరోసారి చోటు దక్కడం చాలా సంతోషంగా ఉందని, ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి శుభాకాంక్షలు (Greetings) తెలుపుతున్నానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీ (Delhi)లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కేబినెట్ మంత్రిగా పనిచేశానని, ఇప్పుడు రెండోసారి కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చిందని చెప్పారు. కేంద్ర క్యాబినెట్లో ఎలాంటి శాఖ ఇచ్చిన సమర్థవంతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. తనను ఎంపీగా గెలిపించిన సికింద్రాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana)) అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి గతంలో కూడా ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చానన్నారు. కొందరు రాజకీయంగా తనను విభేదించి.. కామెంట్లు చేసే మూర్ఖులను అసలు పట్టించుకోనన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు టెక్ట్స్‌టైల్ పార్కు, రైల్వే ప్రాజెక్టులు , కేంద్ర సంస్థలు తీసుకొచ్చానని కిషన్ రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హీరోలుగా ఉన్న ఆ నేతలు ఇప్పుడు జీరోలు..
కేబినెట్ బెర్త్‌లపై ఆ ఎమ్మెల్యేల ఆశలు..
ఆ జిల్లాలో వైసీపీ ఓటమికి కారణాలు ఇవే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News