ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mahender Reddy: హిమాన్షు పేరిట ఆ భూములు.. కేకే మహేందర్ రెడ్డి సంచలన ఆరోపణలు

ABN, Publish Date - Jul 10 , 2024 | 08:54 PM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి (KK Mahender Reddy) సంచలన ఆరోపణలు చేశారు. 2009 నుంచి 2023 వరకు కేటీఆర్ ఆస్తులు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు.

KK Mahender Reddy

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి (KK Mahender Reddy) సంచలన ఆరోపణలు చేశారు. 2009 నుంచి 2023 వరకు కేటీఆర్ ఆస్తులు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. కేటీఆర్ అడ్డంగా దొరికిపోయారని.. ఇందుకు ఎన్నికల అఫిడవిట్లే సాక్ష్యమని తెలిపారు. అవి చూస్తే చాలు కేటీఆర్ ఎంత అవినీతిపరుడో ప్రజలకు అర్థం అవుతుందని చెప్పారు. 2018 నుంచి 2023 వరకు కేటీఆర్ అక్రమ సంపాదనకు అడ్డు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. విచ్చలవిడిగా దోచుకున్నాడు, అక్రమాస్తులను కూడబెట్టారని విమర్శించారు.


కేటీఆర్ నిజంగా అవినీతిపరుడు కాకపోతే ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణ హై కోర్టులో తాను ఎలక్షన్ పిటిషన్ వేశానని.. దీనిపై హైకోర్టు కేటీఆర్‌కు నాలుగు వారాల నోటీస్ ఇచ్చిందని గుర్తుచేశారు. దీనిపై కేటీఆర్ తప్పక తెలంగాణ ప్రజలకు హైకోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు.


2018 అఫిడవిట్లో కేటీఆర్ తన కొడుకు హిమాన్షు‌ను డిపెండెంట్‌గా చూపాడని అన్నారు. హిమాన్షు మేజర్ అయిన వారంలోపే తెలంగాణ పబ్లికేషన్స్‌కు చెందిన రూ.98 లక్షలు విలువ చేసే 36 ఎకరాల భూమిని బదిలీ చేశారని ఆరోపణలు చేశారు. నిన్న, మొన్ననే మేజర్ అయిన తన కొడుకు హిమాన్షు పేరిట 36 ఎకరాల భూమిని రిజిస్టర్ చేయించలేదా అని కేకే మహేందర్ రెడ్డి ప్రశ్నించారు.

Updated Date - Jul 10 , 2024 | 10:38 PM

Advertising
Advertising
<