KTR : కేటీఆర్ వ్యాఖ్యలు.. రాజుకున్న వివాదం.. మహిళ కమిషన్ ముందుకు కేటీఆర్
ABN , Publish Date - Aug 24 , 2024 | 07:13 AM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ రోజు మహిళా కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఇవాళ ఉదయం11గంటలకు కేటీఆర్‌ను కమిషన్ విచారించనుంది.
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఈ రోజు(శనివారం) మహిళా కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేటీఆర్‌ను కమిషన్ విచారించనుంది. మహిళలపై చేసిన వ్యాఖ్యలకు ఆయన వివరణ ఇవ్వనున్నారు. ఈ నెల 15వ తేదీన తెలంగాణ భవన్‌లో స్టేషన్ ఘన్‌పూర్ కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంలో మంత్రి సీతక్క ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై కొంతమంది చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు. అయితే కేటీఆర్ మంత్రి సీతక్క మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చారు. అయితే మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై వివాదం రాజుకుంది. బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్స్, రికార్డింగ్ డాన్సులు చేసినా తాము ఏమంటామని అంటూ వ్యాగ్యంగా మాట్లాడారు.
ALSO Read: Kolkata Doctor Case: కోల్‌కతా హత్యాచారం కేసులో ట్విస్ట్.. నా కొడుకు నిర్దోషి అంటున్న నిందితుడి తల్లి
ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ దిష్టిబొమ్మలను కాంగ్రెస్ మహిళ నేతలు దగ్ధం చేశారు. మహిళల గురించి వివాదాస్పద కామెంట్స్ చేశారని సుమోటోగా స్వీకరించి మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చింది. ఈరోజు కమిషన్ ముందు హాజరై కేటీఆర్ వివరణ ఇవ్వనున్నారు. ఇప్పటికే తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. యథాలాపంగా అన్నానే తప్పా మహిళలను అవమానించే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు.
అయినా కమిషన్ నోటీస్ ఇవ్వడం పట్ల కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిషన్‌కు వివరణ ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలపై జరిగిన దాడుల వివరాలు అందజేస్తానని చెబుతున్నారు. మహిళల మీద జరిగిన దాడులు, అఘాయిత్యలపై కమిషన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కేటీఆర్ వివరణపై మహిళా కమిషన్ ఎలా స్పందిస్తుందనే విషయంపై ఆసక్తి నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి
Nagarjuna: నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత..
Minister Krishna Rao: ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. మంత్రి జూపల్లి ఏమన్నారంటే..?
Read Latest TG NEWS And Telugu News