Kunamneni: మోదీకి పదవీకాంక్ష పీక్స్‌కు చేరింది: కూనంనేని
ABN , Publish Date - May 24 , 2024 | 01:18 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన హామీలు నెరవేర్చటంలో నరేంద్రమోదీ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి పదవీకాంక్ష పీక్స్‌కు చేరిందన్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) రాష్ట్రాల విభజన హామీలు (Separation Guarantees) నెరవేర్చటంలో నరేంద్రమోదీ ప్రభుత్వం (Narendra Modi Govt.) విఫలమైందని సీపీఐ రాష్ట్రకార్యదర్శి (CPI State Secretary) కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasivarao) తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ (PM Modi)కి పదవీకాంక్ష పీక్స్‌కు చేరిందన్నారు. ముస్లిం రిజర్వేషన్లను సాకుగా చూపి బీజేపీ ప్రజలను రెచ్చగొడుతోందని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లు మారుస్తామని మోదీ చెప్పటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. నరేంద్ర మోదీకి ఎన్నికల కమిషన్ (Election Commission) అంటే కూడా లెక్కలేకుండా పోయిందన్నారు.
శ్రీరామనవమి కంటే ముందే శ్రీ రాముని అక్షంతలను పంపిణీ చేశారని, మోదీకి అధికార పిచ్చి పట్టిందని.. అధికారం కోసం దేశాన్ని ఖండాలుగా నరికే ఆలోచనతో బీజేపీ ఉందని కూనంనేని సాంబశివరావు విమర్శించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ కుర్చీ దిగిపోయి అదృష్టవంతుడయ్యారు... ఆయన పాపాలు ఇప్పటి ప్రభుత్వం మోస్తోందని... కొత్త ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడాలంటే అఖిలపక్షం మేధావుల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. వరికి రూ. 500 బోనస్ సన్న బియ్యానికే కాదు.. అన్ని రకాల బియ్యాలకు ఇవ్వాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్
బంగాళాఖాతంలో బలపడుతున్న రెమాల్ తుఫాను
మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి ఫోకస్..!
పోలీసులకు నోటీసులు పంపిస్తా..: శ్రీకాంత్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News