Share News

Loan Apps: రూ.346.86 కోట్ల ఆస్తులు జప్తు

ABN , Publish Date - Aug 23 , 2024 | 08:47 PM

సైబర్ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెండ్ డైరెక్టరేట్ చర్యలు తీసుకుంటుంది. కఠినమైన మనీ ల్యాండరింగ్ కింద కేసులు నమోదు చేసి, లోన్ యాప్ నిర్వాహకులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

Loan Apps: రూ.346.86 కోట్ల ఆస్తులు జప్తు
Loan Apps Money Seized

హైదరాబాద్: సైబర్ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెండ్ డైరెక్టరేట్ చర్యలు తీసుకుంటుంది. కఠినమైన మనీ ల్యాండరింగ్ కింద కేసులు నమోదు చేసి, లోన్ యాప్ (Loan Apps) నిర్వాహకులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 2020-21లో నమోదైన 43 ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. లోన్ యాప్‌కు సంబంధించి ఛార్జీ షీట్ ఫైల్ చేసింది. ఈడీ అధికారులు నమోదు చేసిన ఛార్జీ షీట్‌ను నాంపల్లి కోర్టు పరిగణలోకి తీసుకున్నది.


Loan apps.jpg


అధిక వడ్డీ..

నాన్ ఫెర్మార్మింగ్ సంస్థలతో లోన్ యాప్ నిర్వాహకులు ఒప్పందం చేసుకున్నారని ఈడీ అధికారులు వివరించారు. అధిక వడ్డీ రేట్లకు లోన్ ఇస్తారని పేర్కొన్నారు. లోన్లు ఇచ్చే సమయంలో వినియోగదారుడి వివరాలు సీక్రెట్‌గా సేకరిస్తారని వెల్లడించారు. ఆ సమాచారం ఆధారంగా కస్టమర్లను బ్లాక్ మెయిల్ చేస్తారని.. లోన్ యాప్ వేధింపులు తాళలేక చాలామంది ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు. ఆ క్రమంలో లోన్ యాప్ నిర్వాహకులపై ఉక్కుపాదం మోపామని వివరించారు.


ED.jpg


ఆస్తుల జప్తు

2020-21లో నమోదైన కేసు ఆధారంగా లోన్ యాప్ నిర్వహకులకు చెందిన 346.86 కోట్ల విలువచేసే ఆస్తులను జప్తు చేశామని అధికారులు ప్రకటించారు. అదేవిధంగా వారి ఖాతాల్లో ఉన్న రూ.434 కోట్ల నగదును ఫ్రీజ్ చేశామని పేర్కొన్నారు. లోన్ యాప్‌ల బారిన పడొద్దని అధికారులు సూచించారు. స్పామ్ కాల్స్, అన్ నౌన్ కాల్స్ లిఫ్ట్ చేయొద్దని కోరారు. ఆన్ లైన్‌లో మనీ యాప్స్ నుంచి నగదు తీసుకోవద్దన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Minister Tummala: రుణమాఫీ పథకం-2024పై మంత్రి తుమ్మల సమీక్ష..

Updated Date - Aug 23 , 2024 | 08:47 PM