ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: ఆ సంఘటనపై మేయర్ గద్వాల ఫిర్యాదు

ABN, Publish Date - Jul 09 , 2024 | 07:43 PM

భాగ్యనగరంలోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో(Balkampeta Yellamma Kalyanam) ప్రోటోకాల్ రగడ నెలకొనడంతో నానా రచ్చ జరిగినట్లు వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే.

హైదరాబాద్: భాగ్యనగరంలోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో(Balkampeta Yellamma Kalyanam) ప్రోటోకాల్ రగడ నెలకొనడంతో నానా రచ్చ జరిగినట్లు వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళ్లినప్పుడు ఆలయ అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) దంపతులు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిలు (Mayor Gadwala Vijayalakshmi) అలకబూనారు.!

అంతేకాదు.. ఆలయం బయట అరుగు మీదే కూర్చుండి పోయారు.! ఈ క్రమంలో అధికారులపై అసహనం, కోపంతో మంత్రి ఊగిపోయారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో కొంతమంది వైరల్ చేశారు. ఈ సంఘటనపై మేయర్ గద్వాల విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


అసభ్యంగా పోస్ట్ చేశారు: మేయర్ గద్వాల

కాగా.. ఈ విషయంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు మేయర్ గద్వాల విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. ‘‘సోషల్ మీడియాలో నాపై అసభ్యకర వీడియోలు పోస్ట్ చేశారు. నా వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా వీడియోలు ఉన్నాయి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు నన్ను ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర వీడియోలు పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మేయర్ ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ సంఘటనను పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఖండించారు.

Updated Date - Jul 09 , 2024 | 07:56 PM

Advertising
Advertising
<