ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Komati Reddy: ఎన్నికల కోసం అమ్మేశారు.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు

ABN, Publish Date - Nov 26 , 2024 | 09:47 PM

లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్‌‌ను కేవలం తెలంగాణలో ఎన్నికల ఖర్చుల కోసం రూ.7 వేల కోట్లకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అమ్ముకున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆక్షేపించారు. రాజకీయాల్లో హుందాతనం అవసరమని తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు బుద్ధితెచ్చుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.

హైదరాబాద్: రాజకీయాల కోసం ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టడం తగదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మానవతా ధృక్పథంతో ప్రభుత్వం భూసేకరణ చేస్తుందని తెలిపారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణంతో రాష్ట్రానికి పారిశ్రామిక ప్రగతి సాధిస్తుందని అన్నారు. ఈరోజు(మంగళవారం) గాంధీభవన్‌లో మంత్రి కోమటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు.


కాంగ్రెస్ ఓఆర్ఆర్ నిర్మిస్తే.. బీఆర్ఎస్ అమ్ముకుని సొమ్ముచేసుకుందని ఆరోపించారు. లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్‌‌ను కేవలం ఎన్నికల ఖర్చుల కోసం రూ.7 వేల కోట్లకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అమ్ముకున్నారని ఆక్షేపించారు. ఒక రాజకీయ పార్టీ బ్యూరోక్రట్‌ను కొట్టి చంపే ప్రయత్నాన్ని ప్రోత్సహించడం మంచిది కాదని అన్నారు. రాజకీయాల్లో హుందాతనం అవసరమని తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు బుద్ధితెచ్చుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.


ఫెడరల్ స్పూర్తితో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు: ఎంపీ మల్లురవి

ఫెడరల్ స్పూర్తితో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ మల్లురవి తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన చాలా అంశాలు కేంద్రంతో ముడిపడి ఉన్నాయనే విషయం తెలియక మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విలువలు లేని రాజకీయం కేటీఆర్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పదేళ్లలో సాధించలేని అంశాలను సీఎం రేవంత్ రెడ్డి10 నెలల పాలనలో సాధించారని చెప్పారు. ఆధారాలు లేకుండనే సీఎం కుటుంబ సభ్యులపై కేటీఆర్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇష్టరీతిగా ఇలాగే కేటీఆర్ మాట్లాడితే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.


కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

కేటీఆర్ X వేదికపై రోజూ పంచ్‌లు వేస్తూ.. ఆయన పంచ్‌లకు ఆయనే నవ్వుకుంటూ ఉంటారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో కొందరిని కిరాయికి పెట్టుకుని కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లోక్‌సభలో బీఆర్ఎస్ డిపాజిట్లు కూడా రాకుండా సీట్లు దానం చేశారని విమర్వించారు. ఫెడరల్ వ్యవస్థలో కేంద్రంతో సఖ్యంగా ఉంటూ కావలసినవి సాధించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.సీఎం రేవంత్ ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి పలుమార్లు పలువురు మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలు పరిష్కరిస్తూ వచ్చారని తెలిపారు. డిఫెన్స్ భూములు రేవంత్ రెడ్డి సాధించారని రూ. 5,600 కోట్లు సాధించుకొచ్చారని గుర్తుచేశారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి నిధులు సాధించారన్నారు.చిన్న దొర ఎక్కడో పడుకొని మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం 500 వందల సార్లు అయినా ఢిల్లీకి వెళ్తారని అన్నారు.


మా సీఎం కామన్ మ్యాన్

‘‘మా సీఎం కామన్ మ్యాన్, ఎకానమీ సీట్లలోనే విమానాల్లో సీఎం ప్రయాణాలు చేస్తున్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయవద్దనే ఉద్దేశ్యంతో ప్రత్యేక విమానాల్లో తిరగడం లేదు. ఇప్పటివరకు కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రూ.38,319 కోట్లు వచ్చాయి. రూ.2699 కోట్లు సివిల్ సప్లై శాఖలోనే తెచ్చుకోవడం జరిగింది. కేంద్రం ఏడు టెక్స్‌టైల్ పార్క్‌లను కేటాయిస్తే తెలంగాణకు ఒక్కటీ దక్కింది’’ అని చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.


గిరిజనుల సమస్యలను కేసీఆర్ పట్టించుకోలేదు: ఎంపీ బలరాం నాయక్

గిరిజనుల సమస్యలను కేసీఆర్ పట్టించుకోలేదని కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ అన్నారు. తండ్రి పేరు మీద కేటీఆర్ మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. ఇందిరాపార్క్ వద్ద పదేళ్లు ధర్నాకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. మహబూబాబాద్‌లో కేటీఆర్ సమావేశం పెట్టడం కాదని.. దమ్ముంటే హైదరాబాద్‌లో పెట్టాలని ఎంపీ బలరాం నాయక్ సవాల్ విసిరారు.

Updated Date - Nov 26 , 2024 | 09:50 PM