Share News

Minister Konda Surekha : వాళ్లు జైలుకెళ్తారు.. మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Nov 29 , 2024 | 10:26 PM

మాజీ మంత్రి కేటీఆర్ తమ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. వాంకిడిలో శైలజ అనే విద్యార్థి మరణిస్తే రాజకీయాలకు వాడుకున్నారని ఇది బాధాకరమని చెప్పారు. ఆ అమ్మాయి మరణం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ ఆ అమ్మాయి కుటుంబానికి ఏం సహాయం చేశారని ప్రశ్నించారు.

 Minister Konda Surekha : వాళ్లు జైలుకెళ్తారు..  మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్

హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ తమ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. వాంకిడిలో శైలజ అనే విద్యార్థి మరణిస్తే రాజకీయాలకు వాడుకున్నారని ఇది బాధాకరమని చెప్పారు. ఆ అమ్మాయి మరణం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ ఆ అమ్మాయి కుటుంబానికి ఏం సహాయం చేశారని ప్రశ్నించారు. కోటి రూపాయలు ఇవ్వకపోయారని అన్నారు. ఇవాళ(శుక్రవారం) గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కొండా సురేఖ మాట్లాడాతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గురుకులాల్లో మరణాలు చాలా జరిగాయన్నారు. ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలు అనేకం ఉన్నాయని చెప్పారు.


ఆ అధికారులపై చర్యలు తీసుకోలేదు..

‘‘ఆనాడు కనీసం వారు స్పందించలేదు. అధికారులపై చర్యలు తీసుకోలేదని.. కానీ తాము నలుగురిపై సస్పెన్స్ వేటు వేశామని చెప్పారు. ప్రణాళిక ప్రకారం ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర ఉందని ఆరోపించారు. ‘‘పెట్టుబడులు రావొద్దు అనే ఉద్దేశ్యంతో కలెక్టర్‌పై హత్యకు కుట్ర చేశారు.. రాష్ట్రాన్ని దివాళా తీసి మాకిచ్చినా అభివృద్ధి చేస్తున్నాం. సైకో రావు కలెక్టర్‌ను ఇష్టానుసారం తిట్టారు. మిమ్మల్ని ఓడించినా సిగ్గు రాలేదా. మీరు భూ సేకరణ చేయలేదా. బీఆర్ఎస్ కుట్రలన్నింటిపై విచారణ చేస్తాం’’ అని మంత్రి కొండా సురేఖ తెలిపారు.


కేటీఆర్‌పై చర్యలు..

‘‘కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటాం. చేసిన తప్పుల్లో జైల్‌కు వెళ్తానని కేటీఆర్‌కు తెలుసు. కానీ ప్రజల కోసం జైల్‌కు వెళ్తున్నట్లు స్వతంత్ర సమరయోధునిలా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఎలా కూలుతుంది సైకో రామ్. కేటీఆర్ మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. చెల్లి జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ సంతోషంగా ఉన్నారు. కానీ కవిత బయటకు వచ్చాక ఇబ్బంది పడుతున్నారు. కవిత, హరీష్‌రావు ఒక్కటయ్యారని భయం పట్టుకున్నట్లు ఉంది. గురుకులాల్లో జరుగుతున్న ఘటనల వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని అనుమానం ఉంది. ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక మాఫియాను నడిపించారు.. సైకో రామ్ ఒళ్లు, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. కేటీఆర్ నువ్వు జైల్‌కు వెళ్ళే రోజు దగ్గరలోనే ఉంది. మీ నాన్నకు కూడా సమయం వచ్చినప్పుడు జైల్‌కు వెళ్తారు’’ అని మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు.

Updated Date - Nov 29 , 2024 | 10:46 PM