ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Uttam: కాళేశ్వరంపై కేసీఆర్, కేటీఆర్‌ల ఉచిత సలహాలు అక్కర్లేదు

ABN, Publish Date - Jul 20 , 2024 | 06:29 PM

కాళేశ్వరంపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ల ఉచిత సలహాలు అక్కర్లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. కాళేశ్వరంతో కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలు కూడా రాలేదని.. కానీ మొత్తం తెలంగాణకు నీళ్లు అందించమంటూ కేసీఆర్, కేటీఆర్ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు.

Minister Uttam Kumar Reddy

ఢిల్లీ: కాళేశ్వరంపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ల ఉచిత సలహాలు అక్కర్లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. కాళేశ్వరంతో కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలు కూడా రాలేదని.. కానీ మొత్తం తెలంగాణకు నీళ్లు అందించమంటూ కేసీఆర్, కేటీఆర్ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌కి మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి ఉత్తమ్ ఈరోజు(శనివారం) ఢిల్లీ వెళ్లారు. అక్కడ మీడియా సమావేశంలో కేసీఆర్, కేటీఆర్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు.


ఏ టెస్టులు చేయకుండానే బ్యారేజీలు ఎలా కట్టారని ప్రశ్నించారు. ఏ బ్యారేజీలో కూడా 3-4 టీఎంసీల కంటే ఎక్కువ స్టోరేజి పెట్టరని చెప్పారు. తుమ్మిడిహట్టి దగ్గర తమ ప్రభుత్వం ప్రాజెక్టు కట్టి తీరుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న కాళేశ్వరం అలాగే ఉంటుందని గ్రావిటీ‌తో నీళ్లు తీసుకొచ్చేలా ప్రాజెక్టు రూపొందిస్తామని తెలిపారు. నిర్మాణ పనులు చేసిన కాంట్రాక్టర్లతోనే రిపేర్ పనులు చేయిస్తున్నామని, ప్రభుత్వం ఖర్చు పెట్టలేదని తేల్చిచెప్పారు. గేట్లు పాడవడానికి కారణం ఎవరో కేటీఆర్ సమాధానం చెప్పాలని నిలదీశారు. కాళేశ్వరంపై కేటీఆర్ అబద్ధాలు చెప్పడానికి బుద్ధి ఉండాలని విమర్శించారు.


అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల్లో లోపాలు ఉన్నాయని డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిందని తెలిపారు. ఐదేళ్లలో సుమారు 65 టీఎంసీల నీటిని విడుదల చేశారని చెప్పారు. సంవత్సరానికి 13 టీఎంసీలు మాత్రమే విని యోగించుకోవాలని అన్నారు. ప్రచారం కోసమే కాళేశ్వరాన్ని కేసీఆర్ వాడుకున్నారని అన్నారు. తుమ్మడి హెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఉంటే విద్యుత్ ఖర్చు చాలావరకు తగ్గేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏడాదికి రూ.10 వేల కోట్లు విద్యుత్ ఛార్జీలకే పోతుందని వివరించారు. వడ్డీలు రూ.10 వేల కోట్లు, విద్యుత్ ఖర్చు మరో రూ.10 వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. కేసీఆర్ హయాంలో కట్టిన ప్రాజెక్టు, వాళ్ల హయంలోనే కూలిందని విమర్శించారు. ఈ ప్రాజెక్టుపై కేసీఆర్ 40 రోజులు మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.


అమూల్యమైన ప్రజాధనం వృథా చేశారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలు ఎన్నో ఉచిత సలహాలు ఇచ్చిన తాము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కే సూచనాలకే అప్పగించినట్లు తెలిపారు. వారి సూచనల మేరకు నడుచుకుంటామని అన్నారు. ఇప్పటివరకు జరిగిన టెస్టులు, పనులు, భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలలపై డ్యామ్ సేఫ్టీ అధికారులతో చర్చలు జరిపామని అన్నారు. డ్యామ్ సేఫ్టీ సూచనలను చాలా వరకు అమలు చేశామని తెలిపారు. మరోసారి సోమవారం భేటీ అవుతున్నామని చెప్పారు. మూడు బ్యారేజీల్లోని గేట్లని ఎత్తి నీళ్లు కిందకు వదిలేయాలని లిఖితపూర్వకంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిందని ఆ పనులు జరుగుతున్నాయని వివరించారు.


అబద్దాలు చెప్పడానికి కేటీఆర్‌కి కూడా ఒక హద్దు ఉండాలని విమర్శించారు. బీఆర్ఎస్ దోపిడీ విధానాలతోనే లోపాలు జరిగాయని తెలిపారు. మెడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ అన్నారని, వారి హయాంలోనే కూలిందని చెప్పారు. డ్యామ్ సేఫ్టీ అధికారులకు కేటీఆర్ కంటే ఎక్కువ పరిజ్ఞానం ఉందని భావిస్తున్నామని తెలిపారు. నాశనం చేసినా వారే సలహాలు ఇస్తుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ల ఉచిత సలహాలు అవసరం లేదని స్పష్టం చేశారు. సాంకేతిక కమిటీ నిపుణుల సలహాల మేరకే ముందుకు వెళ్తామని అన్నారు. తుమ్మిడి హట్టి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - Jul 20 , 2024 | 06:54 PM

Advertising
Advertising
<