ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao: రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ వంచన చేస్తోంది: ఎమ్మెల్యే హరీశ్ రావు..

ABN, Publish Date - Sep 08 , 2024 | 01:36 PM

తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ పాలన రైతుల పాలిట యమపాశంగా మారిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. 9నెలల కాంగ్రెస్ పాలనలో 490మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ పాలన రైతుల పాలిట యమపాశంగా మారిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. 9నెలల కాంగ్రెస్ పాలనలో 490మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ పేరుతో రైతులను నయవంచన చేశారని మండిపడ్డారు. మాఫీ కాకపోవడం వల్లే మేడ్చల్ జిల్లా వ్యవసాయ కార్యాలయంలో రైతు సురేందర్ రెడ్డి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.


ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. " రుణమాఫీ కాలేదనే రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. మాఫీ అయితే ఎందుకు ప్రాణాలు తీసుకుంటాడు. మాఫీకి రేషన్ కార్డు లింక్ పెట్టడం వల్లే ఆ రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం బాధితుడు స్వయంగా తన బ్యాంక్ పాస్ బుక్‌పై సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాంగ్రెస్ వల్లనే అన్నదాతల ప్రాణాలు పోతున్నాయి. రుణమాఫీ ఎగ్గొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం 31సాకులు చూపింది. పెళ్లి కాకపోతే కూడా రుణమాఫీ కాలేదు. పెళ్లికి దీనికి సంబంధ ఏంటి?. ఇంకా 21లక్షల మందికి రుణాలు మాఫీ కాలేదు. ఈ పథకం కిదం లబ్ధిపొందిన వారి కంటే పొందని వారే ఎక్కువ మంది ఉన్నారు.


ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర రైతులకు సైతం రుణమాఫీ జరగలేదు. రూ.2లక్షల కంటే ఎక్కువ రుణం ఉంటే ఆపై మెుత్తాన్ని అన్నదాతలే కట్టాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కట్టొద్దని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. ఎవరి మాటలు నమ్మాలి. 9నెలల కాంగ్రెస్ పాలనలో 490మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో తెలీడం లేదు. రైతుల బోనస్ బోగస్ అయ్యింది. 15ఆగస్టు కల్లా మాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి రైతన్నలను మోసం చేశారు. ఆయన అన్నదాతలకు క్షమాపణ చెప్పాలి. రైతులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు. మీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది" అని చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Kishan Reddy: వరదలపై రాజకీయం సరికాదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Deepthi Jeevanji: పారా అథ్లెట్ దీప్తి జీవాంజికి భారీ నజరానా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

HYDRA: అక్రమార్కులపై హైడ్రా ఉక్కుపాదం.. అమీన్‌పూర్‌లో వైసీపీ నేత ఆక్రమణల కూల్చివేత

Murali Mohan: హైడ్రా నోటీసులపై మురళీమోహన్ ఫస్ట్ రియాక్షన్..

Updated Date - Sep 08 , 2024 | 01:47 PM

Advertising
Advertising