MLC Kodandaram:కేటీఆర్ తప్పు చేశారు.. ఎమ్మెల్సీ కోదండరాం షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Dec 20 , 2024 | 12:27 PM
పనికిరాని స్థలంలో మేడిగడ్డ కట్టారని ఎమ్మెల్సీ కోదండరాం విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును తుమ్మిడిహట్టి వద్ద కట్టాల్సిందేనని చెప్పారు. మేడిగడ్డ పనికిరాదని సీడబ్ల్యూసీ తేల్చి చెప్పిందని అన్నారు.
హైదరాబాద్: ఫార్ములా వన్ రేస్ అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై చర్యలు తీసుకోవడం తప్పేం కాదని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు.ఏబీఎన్‌తో ఎమ్మెల్సీ కోదండరాం ఇవాళ(శుక్రవారం) ఫార్ములా వన్ రేస్ కేసు విషయంలో కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ఇలా ఎందుకు అయ్యిందో విచారణకు వచ్చి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చెప్పాల్సిందేనని కోదండరాం అన్నారు. కాళేశ్వరం విచారణకు రావడం కేసీఆర్ బాధ్యత అని చెప్పారు. క్యాబినెట్ అనుమతి లేకుండా ఫార్ములా వన్ రేసు కోసం ప్రజాధనం ఎలా దుర్వినియోగం చేస్తారని ప్రశ్నించారు. ఫార్ములా వన్ రేసు తొందరపాటు నిర్ణయం కాదని.. కేసీఆర్ ప్రభుత్వ తప్పిదమని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు.
ఫార్ములా వన్ రేసులో కేటీఆర్ తప్పు చేశారని అన్నారు.కొత్త కారు కొనడంపై వస్తున్న విమర్శలపై కోదండరాం స్పందించారు. తాను ఈరోజు కాకపోతే రేపైనా కొత్త కారు కొనుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. తన కారు ఇప్పటికే చాలా కిలోమీటర్లు తిరిగిందని... కొత్తది కొనడం తప్పక కొన్నానని తేల్చిచెప్పారు. ఎమ్మెల్సీ అయ్యాక ఇచ్చే లోన్ తీసుకొని కొత్త కార్ తీసుకున్నానని ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టును తుమ్మిడిహట్టి వద్ద కట్టాల్సిందేనని చెప్పారు. మేడిగడ్డ పనికిరాదని సీడబ్ల్యూసీ తేల్చి చెప్పిందని అన్నారు. పనికిరాని స్థలంలో మేడిగడ్డ కట్టారని విమర్శించారు. అన్ని డబ్బులు ఖర్చు చేసినా డిజైన్ లోపాలు, నాణ్యత లోపాలు ఉన్నాయని అన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర నిర్మాణం చేయాలనే డిమాండ్‌కి రేవంత్ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని నమ్ముతున్నానని అన్నారు. కాళేశ్వరం పనికిరాదని నిపుణులు చెబుతున్నారని ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Lagacharla Case: సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న లగచర్ల రైతులు
TG NEWS: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పదిమందికి తీవ్ర గాయాలు
NTR Statue: ఓఆర్‌ఆర్ వద్ద వంద అడుగుల ఎన్టీఆర్ విగ్రహం
Read Latest Telangana News and Telugu News
Updated Date - Dec 20 , 2024 | 12:32 PM