ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rajagopal Reddy: అసెంబ్లీలో KCR లేకపోవడంతో కిక్కురాట్లేదు..!!

ABN, Publish Date - Aug 02 , 2024 | 04:27 PM

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) అసెంబ్లీలో లేకపోవడం వల్ల తమకు కిక్కు రావడం లేదని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) అన్నారు. శుక్రవారం నాడు మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు.

MLA Komatireddy Rajagopal Reddy

హైదరాబాద్: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) అసెంబ్లీలో లేకపోవడం వల్ల తమకు కిక్కు రావడం లేదని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) విమర్శించారు. శుక్రవారం నాడు మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. ‘‘కేసీఆర్ సభకు వస్తే మజా ఉంటుంది. కరెంట్‌పై డిస్కషన్‌లో కేసీఆర్ ఉండి ఉంటే ఇంకా బాగా జరిగేది. ఆయన ఓడిపోయిన ఇంకా జాతిపిత అనుకుంటున్నాడు. కేసీఆర్ ఊహల్లో బతుకుతుండు. పార్టీ మారితే రాజీనామా చేసి వెళ్లాలి. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా వెళ్తారు. మహిళ అని క్లయిమ్ చేస్తున్నప్పుడు గౌరవంగా ఉండాలి కదా. పార్టీ మారి ఉండాల్సింది కాదు. హౌస్‌లో సస్పెన్షన్‌లు చేయకపోవడం మా ప్లాన్. ఎల్ఓపీగా కేసీఆర్ సభకు రాకపోవడంతో ఆ పార్టీ నేతల పరిస్థితి తల్లి లేని పిల్లలుగా అనిపిస్తుంది. మాజీ మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ ఇద్దరిలో ఎవరికి ఎల్ఓపీ ఇచ్చిన బీఆర్ఎస్ ఆగం అవుతది. హరీష్‌రావు మంచి అనుభవం ఉన్న నేత కానీ ఆయనకు ఇవ్వరు. కేటీఆర్‌కు అవగాహన లేదు’’ అని రాజగోపాల్ రెడ్డి సంచలన విమర్శలు చేశారు.


క్రీడాకారులకు శుభవార్త

మరోవైపు తెలంగాణలో (Telangana) క్రీడాకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామని అసెంబ్లీ వేదికగా తెలియజేశారు. శుక్రవారం శాసనసభలో (Telangana Assembly) ముఖ్యమంత్రి మాట్లాడుతూ... గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని బడ్జెట్‌లో రూ.321 కోట్లు కేటాయించిందని తెలిపారు. చదువులోనే కాదు క్రీడల్లోరాణిస్తే కూడా ఉన్నత ఉద్యోగం వస్తుందని, కుటుంబ గౌరవం పెరుగుతుందన్నారు. ఇది నిరూపించేందుకే నిఖత్ జరీన్‌కు ఆర్థిక సాయంతో పాటు జూబ్లిహిల్స్‌, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునేందుకు 600 గజాల ప్లాట్ ఇచ్చామని, అలాగే ఇంటర్ చదవిన సిరాజ్‌కు ఎడ్యుకేషన్‌కు ఎగ్సెమ్షన్ ఇచ్చి మరీ గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చామని చెప్పారు. గ్రాడ్యుయేట్ అయిన నిఖత్‌కు కూడా గ్రూప్ -1 ఉద్యోగం ఇచ్చామని తెలిపారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీ తీసుకువస్తామన్నారు.


బీసీసీఐతో చర్చలు..

వివిధ రాష్ట్రాల పాలసీలు అధ్యయనం చేసి బెస్ట్ పాలసీని తీసుకొస్తామని సీఎం స్పష్టం చేశారు. హర్యానాలో అత్యధికంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో స్పోర్ట్స్ పాలసీని సభలో ప్రవేశపెడతామన్నారు. మండల కేంద్రాల్లో భూములు అందుబాటులో ఉంటే స్టేడియం నిర్మించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించారు. బ్యాగరి కంచెలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు బీసీసీఐతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని.. వారు కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు. రాబోయే కొద్దిరోజుల్లోనే ఇందుకు భూమిని కేటాయిస్తామన్నారు. స్పోర్ట్స్ విషయంలో నిధుల కేటాయింపుతో పాటు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళతామని చెప్పుకొచ్చారు.


స్పోర్ట్స్ పాలసీ కోసం సలహాలు ఇవ్వండి..

వ్యసనాల నుంచి యువతను బయటకు తీసుకువచ్చేందుకు క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. స్పోర్ట్స్ పాలసీ కోసం ఎవరు ఏ సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామన్నారు. హైదరాబాద్‌లో గతంలో నిర్మించిన స్టేడియాలు ప్రైవేట్, రాజకీయ కార్యక్రమాలకే పరిమితమయ్యాయని తెలిపారు. వీటన్నింటినీ అప్ గ్రేడ్ చేసి విద్యార్థులకు క్రీడలపై ఆసక్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలనుకుంటుందని.. అందుకు అందరి మద్దతును కోరుతున్నామన్నారు. అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Aug 02 , 2024 | 04:36 PM

Advertising
Advertising
<