Share News

L Ramana: సంజయ్ కాంగ్రెస్‌లో చేరడం అనైతికం

ABN , Publish Date - Jun 24 , 2024 | 02:01 PM

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పెద్ద ఎత్తున రచ్చకు కారణమవుతోంది. సంజయ్ చేరికపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. అధిష్టానంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఆయనను ప్రభుత్వ విప్పులు ఆది శ్రీనివాస్, లక్ష్మణ్ బుజ్జగిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

L Ramana: సంజయ్ కాంగ్రెస్‌లో చేరడం అనైతికం

హైదరాబాద్: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పెద్ద ఎత్తున రచ్చకు కారణమవుతోంది. సంజయ్ చేరికపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. అధిష్టానంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఆయనను ప్రభుత్వ విప్పులు ఆది శ్రీనివాస్, లక్ష్మణ్ బుజ్జగిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌లో సంజయ్ చేరికపై ఎమ్మెల్సీ ఎల్ రమణ స్పందించారు. ఆయన కాంగ్రెస్‌లో చేరడం అనైతికమని అన్నారు.


పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా చట్టం తెస్తామని రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో చెప్పారని ఎల్ రమణ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ మాటకు విలువ లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్నది రేవంత్ కాంగ్రెస్ పార్టీనా? లేక ఇందిరా కాంగ్రెసా? అని నిలదీశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు స్వయంగా సీఎం రేవంత్ కండువా కప్పుతున్నారని.. ఇది నీతి మాలిన చర్య అని పేర్కొన్నారు. దీనికి రాహుల్ గాంధీ ఏం సమాధానం చెబుతారని రమణ ప్రశ్నించారు. చేనేత కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చేనేతల ఆత్మహత్యల పై చర్చ జరగాలని ఎల్ రమణ డిమాండ్ చేశారు.

Updated Date - Jun 24 , 2024 | 02:01 PM