ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kaleshwaram Project: సబ్‌ కాంట్రాక్ట్‌ సంస్థలపై గురి!

ABN, Publish Date - Jun 16 , 2024 | 04:01 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి సబ్‌ కాంట్రాక్టర్ల వివరాలు సేకరించాలని జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ కమిషన్‌ నిర్ణయించింది. ఇందుకోసం ఆయా నిర్మాణ సంస్థలకు నోటీసులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం.

  • వాటి వివరాలు సేకరించాలని.. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నిర్ణయం

  • మేడిగడ్డలో బ్యారేజీ నిర్ణయం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌దే: మాజీ ఇంజనీర్లు

హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి సబ్‌ కాంట్రాక్టర్ల వివరాలు సేకరించాలని జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ కమిషన్‌ నిర్ణయించింది. ఇందుకోసం ఆయా నిర్మాణ సంస్థలకు నోటీసులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. వివరాలు ఇవ్వని పక్షంలో ఆయా సంస్థలకు సంబంధించి రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీల నుంచి పదేళ్ల ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్‌లు తెప్పించుకొని, వాటిని పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ 8 బ్లాకులుగా ఉండగా.. అందులో 6, 7, 8 బ్లాకులు నిర్మాణ సంస్థ అయిన ఎల్‌ అండ్‌ టీ కట్టలేదని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ విచారణలో భాగంగా మధ్యంతర నివేదిక ఇచ్చిన విషయం విదితమే. నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ బ్యారేజీ మొత్తం కట్టి ఉంటే.. కుంగిపోయిన 7వ బ్లాకుతో పాటు.. బ్యారేజీ మొత్తం ప్రభావితం అయ్యేదని పలువురు నిపుణులు కూడా అనుమానం వ్యక్తం చేశారు.


దాంతో కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణ లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కూడా ఇదే అంశంపై దృష్టి పెట్టారు. ఇక సుందిళ్ల బ్యారేజీని నవయుగ సంస్థ కట్టగా.. అన్నారం బ్యారేజీని అఫ్కాన్స్‌, మేడిగడ్డను ఎల్‌ అండ్‌ టీ నిర్మించింది. సుందిళ్ల, అన్నారంలో సమస్యలు నామమాత్రంగానే ఉన్నాయి. మేడిగడ్డలో ఏడో బ్లాకు కుంగిపోవడంతో బ్యారేజీ మొత్తం విఫలమయింది. మూడు బ్యారేజీల నిర్మాణాల్లో దాదాపు 10-15 మంది దాకా సబ్‌ కాంట్రాక్టర్లు ఉన్నట్లు కమిషన్‌ ప్రాథమికంగా గుర్తించింది. ఇందులో ఒకరు మాజీ సీఎం కేసీఆర్‌ బంధువు కంపెనీ(ప్రతిమా) ఉన్నట్లు విచారణ కమిషన్‌కు సమాచారం ఉంది. దాంతో సబ్‌ కాంట్రాక్టర్ల లెక్కలన్నీ తీసే పనిలో కమిషన్‌ పడింది.


కేసీఆర్‌ మా సిఫారసును పట్టించుకోలేదు

2015లో ఏర్పాటు చేసిన అనంతరాములు కమిటీలోని మాజీ ఇంజనీర్లతో జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ శనివారం భేటీ అయింది. ఈ సందర్భంగా అప్పటి నివేదికను కమిషన్‌ ముందు ఉంచిన మాజీ ఇంజనీర్లు.. మేడిగడ్డను కేసీఆర్‌ సూచించారని, తమ నివేదికను పట్టించుకోలేదని కమిషన్‌కు నివేదించారు. ప్రాణహిత చేవెళ్లలో భాగంగా 152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడితే.. 90 కిలోమీటర్ల దాకా గ్రావిటీతో నీటిని తరలించవచ్చని, 20 మీటర్ల ఎత్తుతో నీటిని పంపింగ్‌ చేస్తే నీరు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో చేరుతుందని నివేదిక ఇచ్చామని ఆ ఇంజనీర్లు ఈ సందర్భంగా తెలిపారు. తమ సిఫారసును కేసీఆర్‌ పట్టించుకోలేదని వారు కమిషన్‌కు నివేదించారు.


విజిలెన్స్‌ పూర్తి నివేదిక రానుంది: జస్టిస్‌ పీసీ ఘోష్‌

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు సంబంధించిన పూర్తి నివేదిక త్వరలోనే కమిషన్‌కు చేరనుందని, దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చామని జస్టిస్‌ పీసీ ఘోష్‌ చెప్పారు. ఇక ప్రస్తుతానికి సాంకేతిక అంశాలపై ఇంజనీర్లతో విచారణ పూర్తి అయిందని, ఈనెల 27వ తేదీలోపు అఫిడవిట్లు చేరాకా.. వాటిలోని అంశాల ఆధారంగా తదుపరి నోటీసులు/సమన్లు/వారెంట్లపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అఫిడవిట్లు పరిశీలించాకా అవసరమైతే కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) అధికారుల వివరణ కూడా అడుగుతామని, అవసరమైతే వారిని కూడా విచారణకు పిలుస్తామని చెప్పారు. కాగా, జస్టిస్‌ పీసీ ఘోస్‌ మలిదశ షెడ్యూల్‌ విచారణను ముగించారు. ఆదివారం ఆయన కోల్‌కత్తాకు వెళ్లిపోనున్నారు.

Updated Date - Jun 16 , 2024 | 04:01 AM

Advertising
Advertising