Share News

Medak: మంత్రులకు రేవంత్‌ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు..

ABN , Publish Date - Jun 20 , 2024 | 04:27 AM

గత కేసీఆర్‌ హయాంలోని మంత్రులకు ఏ మాత్రం స్వేచ్ఛ లేకపోయిందని, ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్న పెద్దాయన అనుమతిస్తే తప్ప సంతకం పెట్టే అవకాశం ఉండేది కాదని మంత్రి కొండా సురేఖ అన్నారు.

Medak: మంత్రులకు రేవంత్‌ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు..

  • కేసీఆర్‌ హయాంలో లేకపోయింది: కొండా సురేఖ

నర్సాపూర్‌/కొల్చారం, జూన్‌ 19: గత కేసీఆర్‌ హయాంలోని మంత్రులకు ఏ మాత్రం స్వేచ్ఛ లేకపోయిందని, ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్న పెద్దాయన అనుమతిస్తే తప్ప సంతకం పెట్టే అవకాశం ఉండేది కాదని మంత్రి కొండా సురేఖ అన్నారు. రేవంత్‌రెడ్డి సర్కారులో మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఉందని, ఎవరి శాఖకు సంబంధించిన నిర్ణయాలు వారే తీసుకునే అవకాశం కూడా ఆయన ఇచ్చారని పేర్కొన్నారు. బుధవారం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌, కొల్చారం మండలాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను మంత్రి సురేఖ అందజేశారు. బడిబాట కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.


ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఆడప్లిలల పెళ్లిళ్లకు రూ.1,00,116తోపాటు తులం బంగారం త్వరలోనే ఇవ్వనున్నట్లు చెప్పారు. పూర్తయిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను త్వరలోనే అర్హులకు అందజేస్తామని చెప్పారు. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ కోసం రేవంత్‌రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారని, మాఫీ జరిగితే రాజీనామా చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే హరీశ్‌రావు అందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి.. సురేఖ ప్యాయంగా పలకరించుకున్నారు.

Updated Date - Jun 20 , 2024 | 04:27 AM