Share News

Mahabubabad: కల్తీ మిర్చి విత్తనాలతో నష్టంపై నివేదిక ఇవ్వండి

ABN , Publish Date - Dec 26 , 2024 | 04:49 AM

మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం కేలోత్‌ తండాలో మిర్చి సాగు చేసిన రైతులు నకిలీ విత్తనాల తో నష్టపోయారని, దీనిపై సంబంధిత అధికారులతో క్షేత్రస్థాయిలో

Mahabubabad: కల్తీ మిర్చి విత్తనాలతో నష్టంపై నివేదిక ఇవ్వండి

  • వ్యవసాయశాఖ డైరెక్టర్‌కు వ్యవసాయ కమిషన్‌ చైర్మన్‌ లేఖ

హైదరాబాద్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం కేలోత్‌ తండాలో మిర్చి సాగు చేసిన రైతులు నకిలీ విత్తనాల తో నష్టపోయారని, దీనిపై సంబంధిత అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపించి సమగ్ర నివేదిక సమర్పించాలని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ ఛైర్మన్‌ ఎం.కోదండరెడ్డి... వ్యవసాయశాఖ డైరెక్టర్‌ గోపికి బుధవారం లేఖ రాశారు.


కేలోత్‌ తండాకు చెందిన నలుగురు గిరిజన రైతులు కొంత భూమిని కౌలుకు తీసుకొని స్థానిక సాయికృష్ణ సీడ్స్‌ అండ్‌ పెస్టిసైడ్స్‌ దుకాణంలో విత్తనాలు కొని మిర్చి పంట సాగు చేసినట్లు పేర్కొన్నారు. పెట్టుబడి పెట్టి, శ్రమించి మిర్చితోటను పెంచితే చివరికి కల్తీ విత్తనాలుగా తేలి రైతులు నష్టపోయారని కోదండరెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై తక్షణమే విచారణ చేపట్టి నివేదికివ్వాలని డైరెక్టర్‌ గోపిని కోదండరెడ్డి కోరారు. విత్తనాలకు సంబంధించిన బిల్లులు కూడా లేఖతో జతపరిచారు.

Updated Date - Dec 26 , 2024 | 04:49 AM