50 ఏళ్ల జమ్మి చెట్టుకు పునరుజ్జీవం
ABN , Publish Date - Jul 18 , 2024 | 11:38 PM
వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో వనపర్తికి వెళ్లే రహదారిలో రోడ్డుపై ఉన్న 50 ఏళ్ల జమ్మి చెట్టుకు ప్రజా ప్రతినిదులు, భక్తులు గురువారం పునరుజ్జీవం కల్పించారు.

- పెబ్బేరు వేణుగోపాలస్వామి ఆలయ ఆవరణలో పునఃప్రతిష్ఠ
పెబ్బేరు, జూలై 18 : వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో వనపర్తికి వెళ్లే రహదారిలో రోడ్డుపై ఉన్న 50 ఏళ్ల జమ్మి చెట్టుకు ప్రజా ప్రతినిదులు, భక్తులు గురువారం పునరుజ్జీవం కల్పించారు. హైస్కూల్ వెనుక భాగంలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయంలో జమ్మి చెట్టును పునః ప్రతిష్ఠించారు. రోడ్డు వెడల్పులో భాగంగా పెబ్బేరు నుంచి వనపర్తి వెళ్లే రహదారిలో అంబేడ్కర్‌నగర్ సమీపంలో 50 ఏళ్ల క్రితం నుంచి ఉన్న జమ్మి చెట్టును ఎక్స్‌కవేటర్ సహాయంతో వేర్లతో సహా తొల గించి దానిని వేణుగోపాలస్వామి ఆలయ ఆవరణలో నాటారు. అయితే నాటిన చెట్టు పచ్చగా చిగురించినట్లుగా కనిపించడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశా రు. ఇలా 50 ఏళ్ల వయస్సు కలిగిన వృక్షాన్ని తీసి మరోచోట నాటడం అరు దుగా కనిపిస్తుంది.