Share News

MP Etala: అన్ని రాష్ట్రాలు సమగ్ర కులగణన చేపట్టాలి..

ABN , Publish Date - Sep 15 , 2024 | 11:48 AM

దేశంలోని అన్ని రాష్ట్రాలు సమగ్ర కులగణన చేపట్టాలని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌(BJP Malkajgiri MP Etala Rajender) డిమాండ్‌ చేశారు. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు స్పందిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు.

MP Etala: అన్ని రాష్ట్రాలు సమగ్ర కులగణన చేపట్టాలి..

- ఎంపీ ఈటల రాజేందర్‌

హైదరాబాద్: దేశంలోని అన్ని రాష్ట్రాలు సమగ్ర కులగణన చేపట్టాలని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌(BJP Malkajgiri MP Etala Rajender) డిమాండ్‌ చేశారు. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు స్పందిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో శనివారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన కుల గణన అంశంలో హైకోర్టు తీర్పు - మేనిఫెస్టో అమలుకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులగణన షెడ్యూల్డ్‌ను ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఈటల రాజేందర్‌ మాట్లాడారు.

ఇదికూడా చదవండి: KTR: ఇంత నీతిమాలిన రాజకీయం ఎందుకు?.. ఎక్స్‌లో కేటీఆర్..


రాష్ట్రంలో కులగణన జరిగితేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య(R. Krishnaiah) మాట్లాడుతూ సమగ్ర కులగణనతో పాటు బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థలలో 42 శాతం పెంచాలని బలమైన ఉద్యమం చేపడతామని, అవసమైతే రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు.


మాజీ ఎంపీ వి.హనుమంతరావు(Former MP V. Hanumantha Rao) మాట్లాడుతూ కులగణన సకాలంలో పూర్తి చేస్తే సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)కి రాష్ట్రంలో మంచి పేరు వస్తుందని, ఆలస్యం చేయకుండా మూడు నెలల్లో పూర్తి చేయాలన్నారు. రైట్‌ టూ ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ను రాష్ట్రంలో అమలు చేయాలని ఇందు కోసం త్వరలో సీఎంకు లేఖ రాస్తానని ఆయన అన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ వినయ్‌కుమార్‌, సీపీఐ ఎంఎల్‌ నాయకుడు కె.గోవర్ధన్‌, సీపీఎం నాయకులు అబ్బాస్‌, టీడీపీ నాయకుడు రామేశ్వర్‌తో పలు బీసీ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి:Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి:Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read LatestTelangana NewsandNational News

Updated Date - Sep 15 , 2024 | 11:48 AM