నారాయణఖేడ్‌, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలు ‘హస్త’గతం | Municipalities of Narayankhed and Sultanabad are 'hands down'
Share News

నారాయణఖేడ్‌, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలు ‘హస్త’గతం

ABN , Publish Date - Feb 29 , 2024 | 05:01 AM

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలు బుధవారం కాంగ్రెస్‌ సొంతమయ్యాయి. నారాయణఖేడ్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా ఆనంద్‌

నారాయణఖేడ్‌, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలు ‘హస్త’గతం

జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా బీఆర్‌ఎస్‌ రెబల్‌

బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఖానాపూర్‌ వైస్‌చైర్మన్‌

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, ఫిబ్రవరి 28: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలు బుధవారం కాంగ్రెస్‌ సొంతమయ్యాయి. నారాయణఖేడ్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా ఆనంద్‌ స్వరూ్‌పషెట్కార్‌, వైస్‌ చైర్మన్‌గా దారం శంకర్‌గుప్తా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపాలిటీలోని 15 వార్డులకు నాలుగేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ 8, బీఆర్‌ఎస్‌ ఏడు స్థానాల్లో గెలిచాయి. ఎక్స్‌అఫీషియో ఓట్ల సాయంతో బీఆర్‌ఎ్‌సకు చెందిన రుబీనా బేగం నజీబ్‌ చైర్‌పర్సన్‌గా, అహీర్‌ పరశురాం వైస్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్‌ఎ్‌సకు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు, గతంలో కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎ్‌సలోకి వెళ్లిన ఓ కౌన్సిలర్‌ హస్తం గూటికి చేరారు. దీంతో కాంగ్రెస్‌ బలం పెరగ్గా పెట్టిన అవిశ్వాస నెగ్గింది. ఎన్నికలు నిర్వహించగా చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఇక, సుల్తానాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, బీఆర్‌ఎ్‌సకు చెందిన ముత్యం సునీతపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గడంతో బుధవారం నిర్వహించిన ఎన్నికలో గాజుల లక్ష్మి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఇక, జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా బీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థి అడువాల జ్యోతి ఎన్నికయ్యారు. అడువాల జ్యోతి ఒక్క ఓటు మెజార్టీతో చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. మరోపక్క, నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మున్సిపాలిటీలో అత్యంత నాటకీయంగా జరిగిన ఎన్నికలో కాంగ్రె్‌సకు చెందిన రాజుర సత్యం అలియాస్‌ చిన్నం సత్యనారాయణ చైర్మన్‌గా, బీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్‌ కావలి సంతోష్‌ వైస్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. చైర్మన్‌ ఎన్నికపై కౌన్సిలర్లంతా ఏకాభిప్రాయాంతో నిర్ణయం తీసుకున్నారు. అయితే, మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తికి వైస్‌ చైర్మన్‌ పదవి ఇవ్వాలని కాంగ్రెస్‌ సభ్యులు పట్టుబట్టగా బీఆర్‌ఎస్‌ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. చైర్మన్‌ రాజుర సత్యం ఇరువర్గాలను సముదాయించగా బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ కావలి సంతో్‌షను వైస్‌ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. అయితే, వైస్‌ చైర్మన్‌ కావలి సంతోష్‌, బీఆర్‌ఎ్‌సకు చెందిన మరో ఇద్దరు కౌన్సిలర్లు, ఓ ఇండిపెండెంట్‌ కౌన్సిలర్‌ బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్‌లో చేరారు.

భువనగిరిలో కాంగ్రెస్‌, బీజేపీ దోస్తీ ?

యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్‌గా కాంగ్రె్‌సకు చెందిన పోతంశెట్టి వెంకటేశ్వర్లు, వైస్‌చైర్మన్‌గా బీజేపీకి చెందిన మాయ దశరథ ఎన్నికయ్యారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌పై జనవరి 23న పెట్టిన అవిశ్వాసం నెగ్గడంతో బుధవారం కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎక్స్‌అఫీషియో సభ్యునిగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, 35 మందికి గాను 29 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. చైర్మన్‌ పదవికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా 29వ వార్డు కౌన్సిలర్‌ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, బీజేపీ తరఫున 22వ వార్డు కౌన్సిలర్‌ బొర్ర రాకేష్‌ పోటీ పడ్డారు. బీఆర్‌ఎ్‌స చైర్మన్‌ స్థానానికి పోటీపడలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి అత్యధికంగా 18మంది మద్దతు పలికారు. ఇక, వైస్‌ చైర్మన్‌ స్థానానికి 25వ వార్డు కౌన్సిలర్‌ మాయ దశరథను బీజేపీ ప్రతిపాదించగా కాంగ్రెస్‌ ఎవరిని పోటీలో పెట్టలేదు. దీంతో మాయ దశరథ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.

కాంగ్రెస్‌ ఎంపీపీ అభ్యర్థికి బీఆర్‌ఎస్‌ ఎంపీటీసీల మద్దతు

రాయికోడ్‌, ఫిబ్రవరి 28: సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ మండల పరిషత్‌ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మొగులప్ప బీఆర్‌ఎస్‌ ఎంపీటీసీల మద్దతుతో ఎన్నికయ్యారు. ఇక్కడ కాంగ్రె్‌సకు మెజారిటీ ఉన్నప్పటికీ ఆ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఎంపీపీ స్థానం కోసం పోటీ పడ్డారు. దీంతో బీఆర్‌ఎస్‌ ఎంపీటీసీల మద్దతు పలికిన మొగులప్ప గెలిచారు. కాంగ్రెస్‌ నుంచి మమత అశోక్‌తోపాటు ఎంపీటీసీ మొగులప్ప నామినేషన్లు వేశారు. కాంగ్రె్‌సకు ఆరుగురు, బీఆర్‌ఎ్‌సకు ఐదుగురు ఎంపీటీసీలు ఉన్నారు. అయితే, బీఆర్‌ఎస్‌ ఎంపీటీసీలు ఓటింగ్‌లో మొగులప్పకు మద్దతు పలికారు. కాంగ్రె్‌సను వీడేది లేదని, దామోదర్‌ రాజనర్సింహ సహకారంతో మండలాన్ని అభివృద్ధి చేస్తానని మొగులప్ప పేర్కొన్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Feb 29 , 2024 | 09:08 AM

News Hub