ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Uttam: కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో అసంపూర్తిగా ప్రాజెక్టులు

ABN, Publish Date - Aug 11 , 2024 | 07:26 PM

కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో ప్రాజెక్టులు పూర్తికాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. చాలా వెనుకబడ్డ దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని తెలిపారు. డిండి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సాగునీటి ప్రాజెక్టు పనులపై ఆదివారం నాడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

Minister Uttam Kumar Reddy

నల్గొండ: కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జిల్లాలో చాలా వెనుకబడ్డ దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని తెలిపారు. డిండి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సాగునీటి ప్రాజెక్టు పనులపై ఆదివారం నాడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ప్రాజెక్ట్‌లకు సంబంధించిన కీలక విషయాలపై మంత్రి ఉత్తమ్ చర్చించారు.


ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, బాలునాయక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... దేవరకొండ మునుగోడు, మిర్యాలగూడ, నల్గొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు హై ప్రియార్టీలో పెట్టి అతి త్వరలో పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. సాంకేతికంగా వచ్చే ఇబ్బందులను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. తాను రాజకీయాల్లో పదవుల్లో ఉన్నా లేకున్నా ఆ పనులు పూర్తి చేయాలని అన్నారు. తాను ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఆ పనులు పూర్తి చేయడానికి వందకు వందశాతం సర్వ శక్తులు ఒడ్డిస్తానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.


హైలైవల్ బ్రిడ్జి మంజారు చేయిస్తా: ఎమ్మెల్యే కూనంనేని

మహబూబాబాద్: గార్ల మండల కేంద్రంలోని పాకల ఏటిపై చెక్‌డ్యామ్‌పై హైలైవల్ బ్రిడ్జి మంజారు చేయిస్తానని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambashiva rao) తెలిపారు. పాకల ఏటిపై ఉన్న చెక్‌డ్యామ్‌ను కూనంనేని పరిశీలించారు. చెక్‌డ్యామ్‌ వద్ద స్థానికులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి చెక్‌డ్యామ్‌పై హైలైవల్ బ్రిడ్జి మంజారు చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


హైలైవల్ బ్రిడ్జి లేకపోవడంతో వర్షాకాలంలో రాంపురం, మద్దివంచ గ్రామాలకు వెళ్లేందుకు చెక్‌డ్యామ్‌ దాటుతూ చాలామంది చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హడావుడి చేసింది తప్ప అమలు చేయలేదని మండిపడ్డారు. అప్పటి మంత్రి సత్యవతి రాథోడ్ రూ.15 కోట్లతో శంకుస్థాపన చేశారని.. ఇంతవరకు దాని పనులు ప్రారంభించలేదని చెప్పారు. అందుకనే జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకీ బుద్ది చెప్పారని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శలు చేశారు.

Updated Date - Aug 11 , 2024 | 08:24 PM

Advertising
Advertising
<