Share News

Suicide Case: పోలీసులకు సవాల్‌గా మారిన ముగ్గురు మృతి కేసు

ABN , Publish Date - Dec 29 , 2024 | 10:54 AM

ఎస్ఐ, కానిస్టేబుల్, నిఖిల్.. ముగ్గురి మృతి కేసులో పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తుకు ఓపెన్ కానీ ఫోన్ల లాక్స్ అడ్డంకిగా మారాయి. శృతి-సాయికుమార్ మధ్య సంబంధం, శృతి - నిఖిల్ ప్రేమాయాణం ఘటనపై కూడా విచారణ చేస్తున్నారు. ముగ్గురు మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ పడి ఆత్మహత్య చేసుకున్నారా...

Suicide Case: పోలీసులకు సవాల్‌గా మారిన ముగ్గురు మృతి కేసు
Suicide Case

కామారెడ్డి జిల్లా: ముగ్గురి మృతి కేసు (Suicide Case) కామారెడ్డి జిల్లా (Kamareddy District) పోలీసులకు (Police) సవాల్‌గా (challenge) మారింది. బిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతిపై అంతు చిక్కని ప్రశ్నలు ఎన్నో పోలీసులకు సవాల్‌గా మారాయి. ఎస్ఐ, కానిస్టేబుల్, ఆపరేటర్ మధ్య సంబంధం ఏంటన్నదానిపై ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ముగ్గురి కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. అయితే వారి ఫోన్‌ల లాక్ ఓపెన్ కాకపోవడంతో దర్యాప్తుగా ఇబ్బందిగా మారింది. ఈ కేసులో భిన్న కోణాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇందులో నిందితులు ఎవరూ లేకపోవడం.. సాక్షులు.. ఈ ముగ్గురికి సంబంధించిన విషయాలు తెలిసినవారు లేకపోవడంతో ఈ కేసు దర్యాప్తు క్రిటికల్‌గా మారింది. పోలీస్ ఉన్నతాధికారులు.. డీజీపీ స్థాయిలో కూడా ఈ కేసుకు సంబంధించి ఆరా తీస్తున్నారు. జిల్లా ఎస్పీ సింధూ శర్మ కూడా ఈ కేసు విచారణ చేస్తున్నారు. గత మూడు రోజులుగా మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి విచారణ చేస్తున్నాయి. అయితే ఇంత వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేవలం ఊహాగానాలు.. తెలిసిన విషయాలతోనే ఇప్పటి వరకు చర్చ జరుగుతోంది. అయితే ఎస్ఐ సాయికుమార్, కానిస్టేబుల్ శృతి మధ్య ఉన్న సంబంధమే ఈ సంఘటనకు దారితీసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఎస్ఐ, కానిస్టేబుల్ మధ్య గత కొంత కాలంగా అనుబంధం కొనసాగుతోంది. వారి మధ్య ఏం జరిగిందో చెప్పేందుకు ప్రత్యక్ష సాక్షి కూడా లేరు. ఈ ఇద్దరికి సంబంధించిన వ్యవహారాన్ని గత కొంత కాలంగా దగ్గరుండి చూస్తున్న నిఖిల్ కూడా ప్రాణాలు కోల్పోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ ముగ్గురు సంఘటన స్థలం వద్దకు ఎలా, ఎన్ని గంటలకు చేరుకున్నారన్న విషయాన్ని టెక్నికల్ ఆధారాలతో పోలీసులు తెలుసుకున్నారు. ఈ నెల 25న ఈ ఘటన జరిగింది. ఈ ముగ్గురి మధ్య ఉన్న సంబంధ సమాచారాన్ని సేకరించారు. ఈ ముగ్గురి మధ్య కీలకమైన సంబంధం ఉందని, ఏదో కీలక విషయంలో ఘర్షణ పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నివేదిక కూడా వారు సహజంగానే నీటిలో మునిగి చనిపోయారని.. ఎవరికీ ఎక్కడా గాయాలు కాలేదని వచ్చింది.

ఈ వార్త కూడా చదవండి.. భార్య, పిల్లలకు విషం ఇచ్చి.. ఉరేసుకున్న కానిస్టేబుల్


కాగా ఎస్ఐ, కానిస్టేబుల్, నిఖిల్.. ముగ్గురి మృతి కేసులో పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తుకు ఓపెన్ కానీ ఫోన్ల లాక్స్ అడ్డంకిగా మారాయి. శృతి-సాయికుమార్ మధ్య సంబంధం, శృతి - నిఖిల్ ప్రేమాయాణం ఘటనపై కూడా విచారణ చేస్తున్నారు. ముగ్గురు మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ పడి ఆత్మహత్య చేసుకున్నారా... ముగ్గురు ఒకేసారి చనిపోయారా.. లేదా ఒకరు ఆత్మహత్యకు ప్రయత్నిస్తే కాపాడేందుకు వెళ్లి మిగిలిన ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారా.. మృతుల బ్యాంక్ ఖాతాలు, లాకర్లను తెరిస్తే ఏదైనా క్లూ దొరకవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తూ ఉన్నతాధికారుల అనుమతి కోరనున్నారు.

కాగా కామారెడ్డి జిల్లాలో భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌, బీబీపేట మహిళా కానిస్టేబుల్‌ శ్రుతి, బీబీపేట సొసైటీ కంప్యూటర్‌ ఆపరేటర్‌ నిఖిల్‌ మూకుమ్మడి ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మృతుల ఫోన్‌కాల్స్‌, వాట్సాప్‌ చాటింగ్‌ ద్వారా పోలీసులకు ప్రాథమికంగా లభ్యమైన కీలక అంశాల ఆధారంగా ఆత్మహత్యలపై శనివారం సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. ఘటనా స్థలమైన అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువును దర్యాప్తు బృందం పరిశీలించింది. చెరువు వద్దకు సాయికుమార్‌, శ్రుతి, నిఖిల్‌ ఏ సమయంలో చేరుకున్నారు? మొదట చెరువులోకి ఎవరు దూకారు? అనే దానిపై దర్యాప్తు బృందం సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసింది. చెరువు నుంచి నీటి నమూనాలు సేకరించింది. ఆ తర్వాత బీబీపేట, భిక్కనూరు పోలీస్‌ స్టేషన్లకు వెళ్లింది.


అక్కడి సిబ్బందిని విచారణ చేసింది. అక్కడా సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసింది. ఈ దర్యాప్తులో పలు కీలకాంశాలు తెలిసినట్లు సమాచారం. ఈ నెల 25న ఉదయం 11.45 గంటల సమయంలో సాయికుమార్‌ సొంత కారులో భిక్కనూరు టోల్‌గేట్‌ నుంచి కామారెడ్డి వైపు రావడాన్ని పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో కారులో అతను ఒక్కడే ఉన్నాడు. జంగంపల్లిలోని ఓ దాబా వద్ద కారు ఆపాడు. అదే ప్రాంతంలో నిఖిల్‌ బైక్‌ నిలిపి ఉన్నట్లు గుర్తించారు. వీరిద్దరూ కలిసి కారులో కామారెడ్డి బస్టాండ్‌కు వెళ్లి... శ్రుతిని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలను బస్టాండ్‌ సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీ నుంచి పోలీసులు సేకరించారని సమాచారం. వీరు ఆ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువుకు చేరుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కస్తూరిభా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆకలి కేకలు

కాకినాడలోని స్టెల్లా షిప్‌కు మోక్షం..

ఘోర విమాన ప్రమాదం.. 28 మంది స్పాట్ డెడ్

తారలు.. దిగివచ్చిన వేళ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 29 , 2024 | 10:54 AM