Share News

BJP: చివర దశకు చేరుకున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారం.. తెలంగాణకు మరోసారి రానున్న మోదీ

ABN , Publish Date - May 09 , 2024 | 08:01 AM

పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చివర దశకు చేరుకుంది. బీజేపీ అధిష్టానం అయితే తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ నుంచి కేంద్ర హో మంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్ర నేతలంతా తెలంగాణలో ఒకరి తర్వాత ఒకరు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎలాగైనా పెద్ద మొత్తంలో ఎంపీ సీట్లను రాబట్టుకోవాలని బీజేపీ అధిష్టానం పట్టుదలతో ఉంది.

BJP: చివర దశకు చేరుకున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారం.. తెలంగాణకు మరోసారి రానున్న మోదీ

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చివర దశకు చేరుకుంది. బీజేపీ అధిష్టానం అయితే తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ నుంచి కేంద్ర హో మంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్ర నేతలంతా తెలంగాణలో ఒకరి తర్వాత ఒకరు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎలాగైనా పెద్ద మొత్తంలో ఎంపీ సీట్లను రాబట్టుకోవాలని బీజేపీ అధిష్టానం పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు మార్లు తెలంగాణకు వచ్చి వెళ్లిన మోదీ, అమిత్‌ షాలు మరోసారి ప్రచారానికి రానున్నారు. ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది.

Lok Sabha Election 2024:మోదీ పాలనలో అచ్చె దిన్ కాదు చచ్చే దిన్ వచ్చింది.. కేసీఆర్ ఫైర్


తెలంగాణలో బీజేపీ అగ్రనేతల ప్రచారం జరుగనుంది. ఉదయం 9 గంటలకు భువనగిరిలో అమిత్ షా బహిరంగ సభ నిర్వహించనున్నారు. భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌కు మద్దతుగా అమిత్‌ షా ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు రఘనందనరావుకు మద్దతుగా నర్సాపూర్ సభలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పాల్గొననున్నారు. రేపు తెలంగాణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. నారాయణపేట, హైదరాబాద్ ఎల్బీ స్టేడియం సభల్లో పాల్గొననున్నారు. ఎల్లుండి మరోసారి తెలంగాణకు బీజేపీ అగ్రనేత అమిత్ షా రానున్నారు. వికారాబాద్, వనపర్తి బహిరంగ సభల్లో అమిత్ షా ప్రసంగించనున్నారు.

ఇవి కూడా చదవండి..

PM Modi : అదానీ, అంబానీ నుంచి ఎంత ముట్టింది?

KCR : చిన్నపాటి వానకే పది గంటలు కరెంట్‌ పోతదా?

Read more Telangana News and Telugu News

Updated Date - May 09 , 2024 | 08:43 AM