చేవెళ్ల అభివృద్ధికి సహకరించాలి
ABN , Publish Date - Jan 11 , 2024 | 12:26 AM
చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళ నియోజకవర్గ ఇన్‌చార్జి పామెన భీంభరత్ అన్నారు. బుధవారం నగరంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్వీకర్ ప్రసాద్‌కుమార్‌లను కలిసి చేవెళ్ల నియోజకవర్గ అభివృద్దికి కృషి చేయాలని వారిని కోరారు. .

షాబాద్, జనవరి 10 : చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళ నియోజకవర్గ ఇన్‌చార్జి పామెన భీంభరత్ అన్నారు. బుధవారం నగరంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్వీకర్ ప్రసాద్‌కుమార్‌లను కలిసి చేవెళ్ల నియోజకవర్గ అభివృద్దికి కృషి చేయాలని వారిని కోరారు. .
సీఎంతో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి భేటీ
షాద్‌నగర్ : షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతా్‌పరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్దితో బుధవారం సమావేశమయ్యారు. పలు విషయాలపై వారిరువురూ చర్చించినట్లు సమాచారం. వీరి సమావేశం చర్చానీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎమ్మెల్సీ కోసం ఆశిస్తున్నారా? లేక సాధారణంగానే కలిశారా? అని స్థానిక నాయకులు చర్చించుకుంటున్నారు.