Telangana: ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం.. పలు చోట్ల వర్షాలు
ABN , Publish Date - Apr 12 , 2024 | 09:49 PM
వేసవి ప్రారంభానికే ఎండలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలోని ( Telangana ) కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44.5 డిగ్రీలు దాటేసింది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఏప్రిల్ ఆరంభంలోనే మే నెలను తలపించేలా వడగాలులు వీచాయి.
వేసవి ప్రారంభానికే ఎండలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలోని ( Telangana ) కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44.5 డిగ్రీలు దాటేసింది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఏప్రిల్ ఆరంభంలోనే మే నెలను తలపించేలా వడగాలులు వీచాయి. దీంతో ఇంటి నుంచి బయటకు రాలేక, ఇళ్లల్లో ఉండలేక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ తరుణంలో రెండు రోజులుగా వాతావరణం చల్లబడింది. అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఓ వైపు పగలంతా ఎండ. మరోవైపు సాయంత్రమైతే వర్షం. మే నెలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు మించి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
AP Elections: షర్మిలపై వైసీపీ ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్.. ఏమన్నారో తెలుసా..
తెలంగాణలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే ఐదు రోజుల పాటు ఉత్తర తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. వాతావరణం చల్లబడడంతో తెలంగాణలో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. ఇక రాగల 24 గంటల పాటు హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వివరించారు.
AP Elections: కాంగ్రెస్, వామపక్ష పార్టీల పొత్తు.. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే..
గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన నల్గొండ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురిశాయి. ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షాలు కాస్త ఊరట కలిగించాయి. వేడి గాలుల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. అకాల వర్షం కురుస్తుండటంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. కళ్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.